Bengaluru News: అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు..
ABN , Publish Date - Nov 22 , 2025 | 01:19 PM
బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. సన్న పామప్ప అలియాస్ పామన్న నేరం చేసినట్లు రుజువు కావడంతో రాయచూరు జిల్లా మూడో అదనపు ఫాస్ట్‌ట్రాక్ న్యాయాధికారి బీబీ జకాతి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు.
- రూ.లక్ష జరిమానా
- రాయచూరు కోర్టు న్యాయాధికారి తీర్పు
రాయచూరు(బెంగళూరు): బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. సన్న పామప్ప అలియాస్ పామన్న నేరం చేసినట్లు రుజువు కావడంతో రాయచూరు(Rayachuru) జిల్లా మూడో అదనపు ఫాస్ట్‌ట్రాక్ న్యాయాధికారి బీబీ జకాతి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. సింధనూరు తాలూకాలోని ఓ గ్రామంలో 2020 జనవరిలో పామన్న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలిక తల్లిదండ్రులు సింధనూరు రూరల్ పోలీస్ స్టేషన్(Sindhanur Rural Police Station)లో ఫిర్యాదు చేయగా డీఎస్పీ విశ్వనాథ్‌రావ్, సర్కిల్ ఇన్స్‌పెక్టర్ బాలచంద్ర లక్కం నేతృత్వంలో కేసు దర్యాప్తు చేపట్టారు. సింధనూరు రూరల్ పోలీసులు సాక్షాధారాలను న్యాయస్థానానికి అప్పగించారు. నేరం రుజువు కావడంతో ముద్దాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పునిచ్చారు. దీంతో పాటు ప్రభుత్వ పరంగా బాధితులకు ఇచ్చే పరిహారం నిధుల ద్వారా రూ.లక్ష అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోషల్ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు
Read Latest Telangana News and National News