Bengaluru News: ఇక్కడ.. కంచే చేను మేసింది.. ఇద్దరు ఎస్‌ఐలు సహా నలుగురి అరెస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే...
ABN , Publish Date - Nov 26 , 2025 | 01:50 PM
పోలీసులే దొంగలుగా మారారు. బాధ్యతగా ఉండాల్సిన రెండు చుక్కల అధికారులు కూడా దారితప్పారు. తమ స్వార్ధబుద్దితో ఓ వ్యాపారిని బెదిరించి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. చివరకు కటకటాలపాలయ్యారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం దావణగెరెలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
- దొంగ పోలీసులు...
- వ్యాపారిని బెదించి బంగారం దోపిడీ
- ఇద్దరు ఎస్‌ఐలు సహా నలుగురి అరెస్టు
- బంగారం, నకిలీ తుపాకీ స్వాధీనం
బళ్లారి(బెంగళూరు): కంచే చేను మేస్తే అన్న చందానా... పోలీసులే దోపిడి దొంగలయ్యారు. పోలీసుల దుశ్చర్యపై సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. రక్షన భటులే ఇలా చేస్తే ప్రజలు గోడు ఎవరికి చెప్పుకోవాలి... ఏమని చెప్పుకోవాలి.. అని వాపోతున్నారు. కారవార ప్రాంతానికి చెదిన బంగారు వ్యాపారి విశ్వనాథ్ అనే వ్యక్తి దావణగెరలో బంగారు వ్యాపారుల నుంచి బంగారు బిస్కట్లు కొని ఆభరణాలు తయారు చేసి అమ్మేవారు.
ఈ నేపథ్యంలో నవంబరు 24 సోమవారం మధ్యరాత్రి 12.30గంటల సమయంలో దావణగెరలో గట్టి బంగారం కొని కారవారకు వెళ్ళేందుకు దావణగెరె కెఎస్ ఆర్టీసీ బస్సులో కూర్చున్నారు. అంతకు ముందు బంగారు వ్యాపారి గురించి వివరాలు సేకరించిన ఇద్దరు పోలీసులు అధికారులు మాళప్ప చిప్పలకట్టి, ప్రవీణ్ కుమార్ సివిల్ డ్రెస్‌లో వచ్చి బస్సులో కూర్చొన్న బంగారు వ్యాపారిని కాలర్ పట్టుకుని కిందకు దించారు. తాము పోలీసులు అధికారులమని బెదిరించారు... అయితే వ్యాపారి తమను పోలీసులను ఎలా నమ్మేదని ప్రశ్నించడంతో ఇద్దరు పోలీసు అధికారులు తమ వద్ద ఉన్న ఐడీకార్డును చూపించారు.

బస్టాండ్ బయట ఉన్న పోలీసు జీప్, నకిలీ గన్ చూపి విశ్వనాథ్ వద్ద ఉన్న సుమారు 80 గ్రాముల బంగారాన్ని లాక్కున్నారు. అనంతరం వ్యాపారి విశ్వనాథ్‌ను అదే జీపులో కేటీజీ నగర్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళిన పోలీసు స్టేషన్ ముందు నిలబడి తాము ఐజీపీ స్క్వాడ్‌లో ఉన్నామని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐజీపీ సూచనల మేరకు వ్యాపారిని తీసుకెళుతున్నట్లు చెప్పి అదేజీపులో కేఎఎస్‌ఆర్టీసీ బస్టాండు వద్ద నిలిపి కారవారకు తిరిగి వెళ్ళమని చెప్పి ఇద్దరు పోలీసులు వెళ్లిపోయారు. అనుమానం వచ్చిన వ్యాపారి విశ్వనాథ్ కేటీజీ నగర్ పోలీసు స్టేషన్‌లో జరిగిన విషయంపై ఫిర్యాదు చేశాడు.
వెంటనే అప్రమత్తమైన కేటీజీ పోలీసులు ఇద్దరు పీఎస్ఐ అధికారులను, వారికి సహాయం చేసిన బంగారు దుకాణంలో పనిచేసే వినాయక నగర్‌కు చెందిన సతీష్ రేవణ్ణర్, శిరసికి చెందిన నాగరాజు రేవణ్ణవర్‌ను అరెస్టు చేశారు. పీఎస్‌ఐలు మాళప్ప, ప్రవీణ్ ఇటీవలే హావేరి నుంచి దావణగెర పూర్వ విభాగం ఐజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. అయితే మరి కొన్ని రోజుల్లో విధులకు సంబంధించి బదిలీ అవుతుందనే తరుణంలో చేయరాని పనులు చేసి కటకటాల పాలయ్యారు. ఇద్దరు పీఎ్‌సఐలు చేసిన పనికి పోలీసు వ్యవస్థ తలదించుకునేలా అయిందని దావణగెర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు
మావోయిస్టుల కస్టడీ పిటిషన్ వెనక్కి
Read Latest Telangana News and National News