Share News

ATM Robbery: సినిమాను మించిన సీన్.. కళ్లు చెదిరే చోరీ..

ABN , Publish Date - Nov 19 , 2025 | 06:53 PM

బెంగళూరులో పట్టపగలే బ్యాంక్ సిబ్బందిని దుండగులు బురిడీ కొట్టించారు. ఆర్బీఐ అధికారులమంటూ బ్యాంక్ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది మోసగించి ఏటీఎం వాహనంలోని నగదుతో పరారయ్యారు.

ATM Robbery: సినిమాను మించిన సీన్..  కళ్లు చెదిరే చోరీ..
ATM Robbery at Bengaluru

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు(Bengaluru)లో పట్టపగలే చోరీకి పాల్పడ్డారు దుండగులు. డైరీ సర్కిల్(Dairy Circle) వద్ద భద్రతా సిబ్బందిని మోసగించి ఏటీఎం(ATM)లో నగదు తరలించే వాహనంలోని రూ.7.11 కోట్ల నగదుతో ఉడాయించారు. ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.


నగరంలోని డైరీ సర్కిల్ వద్దగల ఓ ఏటీఎం మెషీన్‌లో నగదు డిపాజిట్(Cash Deposit) చేసేందుకు గానూ వాహనంలో క్యాష్‌(Cash)తో బయల్దేరారు బ్యాంక్ సిబ్బంది. ఇంతలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(Govt of India) అని ఉన్న ఓ ఇన్నోవా వాహనం(Innova)లో దుండగులు సమీపించారు. తాము ఆర్‌బీఐ(Reserve Bank of India) అధికారులమని చెబుతూనే సిబ్బందిని మోసగించి వాహనంలోని నగదును దోచుకెళ్లారు. చోరీకి గురైన సమయంలో అందులో రూ.7.11 కోట్ల క్యాష్ ఉందని సదరు సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందంతో దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఇవీ చదవండి:

అమెరికా జంటహత్యల మిస్టరీ గుట్టురట్టు.. క్లూ ఇచ్చిన ల్యాప్‌టాప్.!

ఎర్రకోట బ్లాస్ట్‌లో షాకింగ్ అప్‌డేట్.. పార్కింగ్ లాట్‌లోనే బాంబు తయారు చేసి..

Updated Date - Nov 19 , 2025 | 08:03 PM