Home » Bandi Sanjay
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానా ల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమ లు చేయలేకపోయారని, 3 శాతం మందికి కూడా లబ్ధి చేకూర్చలేకపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను ఆలింగనం చేసుకున్నప్పుడు బీజేపీ నేతలకు ఆయన భావజాలం గుర్తుకు రాలేదా?’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
నక్సల్ భావజాలం ఉన్న గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ప్రశ్నించారు. అనేక మంది పోలీసులను ఎన్‌కౌంటర్ పేరుతో మర్డర్ జేసిన ఆయనకు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని.. కాంగ్రెస్‌కు నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు.
ఇందిరమ్మ పేరు పెడితే తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
‘‘ బలహీన వర్గాల ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా? ఈ ఇళ్లకు ఏమైనా నీ ఇంట్లో డబ్బులు ఇస్తున్నవా?’’ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
ఇందిరమ్మ అంటేనే ఎవరికైనా గుర్తుకు వచ్చేది.. రోటీ, కపడా, మకాన్ అని టీపీసీసీ అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. దేశంలో.. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఆమె ఇచ్చిన ఇల్లు, ఇంటి జాగా ఇప్పటికీ కనిపిస్తాయని చెప్పారు.
Kavitha:తెలంగాణలో రాజ్యాంగ విలువలు కాపాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బాధ్యతాయుతమైన కేంద్రమంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు.
Ponnam Prabhakar: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్ అసహనానికి పరాకాష్టగా మారారని ఆయన అభివర్ణించారు.
ఇందిరమ్మ త్యాగం ముందు బీజేపీ త్యాగం ఎంత.. మోదీ పర్సనాలిటీ ఎంత?’ అంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ నిలదీశారు. కేంద్ర పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే నిధులివ్వబోమంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ఏ హక్కుతో అన్నారని ప్రశ్నించారు.