Bandi Sanjay: వాగ్దానాల్లో ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదు
ABN , Publish Date - Jan 30 , 2025 | 03:49 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానా ల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమ లు చేయలేకపోయారని, 3 శాతం మందికి కూడా లబ్ధి చేకూర్చలేకపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.

కూలీలకు ‘భరోసా’ ఇవ్వరా?
40 లక్షల కొత్త రేషన్ కార్డులంటూ కేవలం 42 వేల మందికే ఇస్తారా?
సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానా ల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమ లు చేయలేకపోయారని, 3 శాతం మందికి కూడా లబ్ధి చేకూర్చలేకపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో 12991 గ్రామ పంచాయతీలుంటే, కేవలం 561 గ్రామాలను ఎంపిక చేసి నాలుగు పథకాలను మం జూరు చేయడం విస్మయానికి గురి చేసిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో 70 లక్షల మంది అర్హులైన రైతులు ఉంటే కేవలం 4,41,911 మంది రైతుల ఖాతాల్లోనే రైతు భరోసా నిధులు వేయడం బాధాకరమని పేర్కొన్నారు.
వ్యవసాయ భూమి లేని 10 లక్షల మంది కూలీల కుటుంబాలకు ఎకరానికి రూ. 6 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కేవలం 20,336 మందికే ఇచ్చారని, మిగిలిన వారికి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. రేషన్ కార్డులు, ఇందిర మ్మ ఇళ్ల మంజూరులోనూ ఇచ్చిన హామీని అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ నాలుగు పథకాలను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.