Share News

Kavitha: నిధులివ్వబోమనడం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం

ABN , Publish Date - Jan 27 , 2025 | 06:01 AM

ఇందిరమ్మ పేరు పెడితే తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ప్రకటించడం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Kavitha: నిధులివ్వబోమనడం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం

  • రాష్ట్రాల హక్కులను హరించేలా బండి వ్యాఖ్యలు : కవిత

అఫ్జల్‌గంజ్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ పేరు పెడితే తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ప్రకటించడం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇది రాష్ట్రాల హక్కులను హరించడమేనని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం సెమినార్‌లో కవిత మాట్లాడారు.


కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాకెట్‌ డైరీలా రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతూ దానిని కాపాడాలని చెబుతుంటారని, కానీ తెలంగాణలో హననమవుతున్న రాజ్యాంగ స్ఫూర్తి పట్ల ఆయన మాట్లాడడం లేదన్నారు.

Updated Date - Jan 27 , 2025 | 06:01 AM