Home » AV Ranganath
హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్‌లో నిన్న రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారని రంగనాథ్ వెల్లడించారు.
యాకుత్‌పురా మౌలా కా చిల్లాలో జరిగిన క్యాచ్‌పిట్ ప్రమాద ఘటనను హైడ్రా తీవ్రంగా పరిగణించింది. వరద నీటి కాలువలో వ్యర్థాలు తొలగించి తిరిగి మూత ఏర్పాటు చేయలేదని గుర్తించిన కమిషనర్ ఏవీ రంగనాథ్ బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.
ఓ వ్యక్తితో కలిసి డిజిటల్ మీడియా ప్రతినిధులు హైడ్రా పేరు చెప్పి కొందరు రూ.50 లక్షలు వసూలు చేయడంతో ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైడ్రాకు ఫిర్యాదు చేయాలనుకుంటే బుద్ధభవన్‌లోని సంస్థ కార్యాలయంలో అధికారులను నేరుగా సంప్రదించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు హైడ్రా టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణ/కబ్జాలు, విపత్తుల నిర్వహణ సంబంధిత సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1070ను కేటాయించింది. ఇప్పటి వరకు ప్రజావాణి, ఎక్స్ ద్వారానే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండగా.. తాజాగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
బతుకమ్మ కుంట అభివృద్ధిపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం పరిశీలించారు. చెరువును కాపాడేందుకు శాశ్వత సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
హైడ్రా వంటి సంస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలని ఢిల్లీ మునిసిపల్ అధికారుల బృందం అభిప్రాయపడింది. హైడ్రా ఉంటేనే చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా ఉంటాయని పేర్కొంది. అంబర్‌పేటలో హైడ్రా పునర్నిర్మించిన బతుకమ్మకుంట చెరువును ఆ బృందం బుధవారం సందర్శించింది.
గండిపేట మండలంలోని పుప్పాలగూడ గ్రామంలో 200 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా అరికట్టి చరిత్రను కాపాడతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు.
లే అవుట్‌లను ప్రామాణికంగా తీసుకొని పార్కులు, రోడ్లు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జాదారుల చెర నుంచి కాపాడుతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నివాస ప్రాంతాల్లో పార్కుల ఆవశ్యకతను అర్థం చేసుకొని వాటిని ఆక్రమించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
వరదనీరు సున్నం చెరువులో కలిసేలా మురుగునీరు కిందకు పోయేలా నాలాల నిర్మాణం ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు సూచించారు. బోరబండ, సున్నం చెరువు ప్రాంతాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. అల్లాపూర్, బోరబండ డివిజన్లను కలుపుతూ సాగే నాలాలను విస్తరించాలన్నారు.
నగరంలోని నాలాలు, క్యాచ్‌పిట్లు, కల్వర్టుల్లోని చెత్తను హైడ్రా బృందాలు తొలగిస్తున్నాయి. హైడ్రా డీఆర్‌ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు), ఎంఈటీ (మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్స్) బృందాలు నిరంతరాయంగా నాలాల్లో చెత్తను తొలగిస్తున్నాయి.