Home » Army
మణిపుర్(Manipur) లో ఈ ఏడాది ప్రథామార్థంలో కుకీ, మైతేయి తెగల మధ్య జరిగిన హింస దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. అయితే ఈ ఘర్షణల్లో దుండగులు హింసకు పాల్పడటానికి వివిధ మార్గాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో హింస చల్లారుతున్న క్రమంలో భద్రతా బలగాలు 3 సర్చ్ ఆపరేషన్లు నిర్వహించి వెపన్స్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) వల్ల సంభవించిన ఆకస్మిక వరదల్లో(Floods) తప్పిపోయిన వారి మృతదేహాలు పదులు సంఖ్యలో బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 55 మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సుపై బుధవారం క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన వరద విపత్తలో 22 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఆకస్మిక వరదల్లో నలుగురు సైనికులతో సహా 19 మంది మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. 100 మందికి పైగా తప్పిపోయారు. సహాయక చర్యలు చేపట్టిన భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాయి. అయితే వాతావరణం అనుకూలించపోవడంతో పరిస్థితి ప్రతికూలంగా మారింది.
ఈశాన్య రాష్ట్రం సిక్కింను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అతలాకూతలం అయింది. ఈ వర్షాల వల్ల వరదలు సంభవించడంతో 23 మంది భారత ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యోదాంతం తరువాత భారత్, కెనడాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా కెనడా సాయుధ దళాల అధికారిక వెబ్ సైట్ ని హ్యాక్ చేశారు.
భారత సైన్యం అమ్ములపొదిలో మరో అరివీర భయంకర అస్త్రం చేరబోతోంది. 'ప్రళయ్' బాలిస్టిక్ క్షిపణుల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చైనా, పాకిస్థాన్‌తో భారత్‌ను కలిపే ఎల్‌ఓసీ, ఎల్ఓసీ వెంబడి ఈ అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులను మోహరించనున్నారు.
గన్ మిస్ ఫైర్(Miss Fire) అయి ఓ ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన జమ్మూ కశ్మీర్(Jammu Kashmir) లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బందిపోరా జిల్లాలోని ఆర్మీక్యాంపు(Army Camp)లో 14 రాష్ట్రీయ రైఫిల్స్ కి చెందిన ఓ జవాన్ తన తుపాకీ(Gun)తో పొరపాటున కాల్పులు జరిపాడు.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్ శనివారంతో నాలుగో రోజుకు చేరుకుంది.
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాల మీద కాల్పులకు పాల్పడటంతో పలువురు అమరులయ్యారు.
సుఖ సంతోషాలను పక్కన పెట్టి.. కుటుంబాలకు దూరంగా.. దేశ రక్షణే ధ్యేయంగా పని చేస్తుంటారు ఆర్మీ జవాన్లు. అవసరమైతే తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతుంటారు. అందుకే సైనికులు ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అమితమైన గౌరవమర్యాదలు లభిస్తుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే సైనికుడు ..