Share News

Manipur Riots:మణిపుర్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు

ABN , First Publish Date - 2023-10-20T14:15:45+05:30 IST

మణిపుర్(Manipur) లో ఈ ఏడాది ప్రథామార్థంలో కుకీ, మైతేయి తెగల మధ్య జరిగిన హింస దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. అయితే ఈ ఘర్షణల్లో దుండగులు హింసకు పాల్పడటానికి వివిధ మార్గాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో హింస చల్లారుతున్న క్రమంలో భద్రతా బలగాలు 3 సర్చ్ ఆపరేషన్లు నిర్వహించి వెపన్స్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

Manipur Riots:మణిపుర్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు

ఇంఫాల్: మణిపుర్(Manipur) లో ఈ ఏడాది ప్రథామార్థంలో కుకీ, మైతేయి తెగల మధ్య జరిగిన హింస దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. అయితే ఈ ఘర్షణల్లో దుండగులు హింసకు పాల్పడటానికి వివిధ మార్గాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో హింస చల్లారుతున్న క్రమంలో భద్రతా బలగాలు 3 సర్చ్ ఆపరేషన్లు నిర్వహించి వెపన్స్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో 1085 బాంబులు, చాలా రకాల ఆయుధాలు(Weapons) ఉన్నాయి. వీటిని పోలీస్ స్టేషన్ల నుంచి లూటీ చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. 14 ఇంప్రూవైజ్డ్ మోర్టార్లు, రాకెట్ లాంచర్లు, ఆరు రైఫిళ్లు, పిస్టళ్లు, 530 రకాల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.


వీటిని శుక్రవారం మణిపుర్ పోలీసులకు అప్పగించారు. ఆర్మీ(Indian Army), మణిపూర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(Border Security Force), ఇండియా రిజర్వ్ బెటాలియన్ కూంబింగ్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఆయుధాలతో తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టం కలిగేలా దుండగులు దుశ్చర్చకు దిగారని అధికారులు తెలిపారు. మైతేయి, కుకీ తెగల మధ్య మే 3న హింస చెలరేగింది. రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన ఈ హింస చిలికి చిలికి గాలి వానలా మారింది. దీంతో ఇరువర్గాల ప్రజలు పరస్పర దాడులకు దిగారు. ఈ దాడుల్లో 175 మంది వరకు మరణించారు. సుమారు 50 వేల మంది పబ్లిక్ నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఓ తెగకు చెందిన మహిళలను పురుషుల గుంపు నగ్నంగా ఊరేగిస్తూ వారిపై అత్యాచారం చేసినందన్న ఆరోపణలు రావడం.. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రధాని మోదీ ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. అప్పటికే కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా మణిపుర్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Updated Date - 2023-10-20T14:15:45+05:30 IST