Sikkim: సిక్కిం రెస్య్కూ ఆపరేషన్‌కి సహకరించని వాతావరణం.. టోల్ ఫ్రీ నంబర్లు ప్రకటించిన ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2023-10-06T09:02:12+05:30 IST

ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సుపై బుధవారం క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన వరద విపత్తలో 22 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఆకస్మిక వరదల్లో నలుగురు సైనికులతో సహా 19 మంది మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. 100 మందికి పైగా తప్పిపోయారు. సహాయక చర్యలు చేపట్టిన భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాయి. అయితే వాతావరణం అనుకూలించపోవడంతో పరిస్థితి ప్రతికూలంగా మారింది.

Sikkim: సిక్కిం రెస్య్కూ ఆపరేషన్‌కి సహకరించని వాతావరణం.. టోల్ ఫ్రీ నంబర్లు ప్రకటించిన ప్రభుత్వాలు

గ్యాంగ్ టక్: ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సుపై బుధవారం క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన వరద విపత్తలో 22 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఆకస్మిక వరదల్లో నలుగురు సైనికులతో సహా 19 మంది మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. 100 మందికి పైగా తప్పిపోయారు. సహాయక చర్యలు చేపట్టిన భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాయి. అయితే వాతావరణం అనుకూలించపోవడంతో పరిస్థితి ప్రతికూలంగా మారింది.


వరదలపై తాజా అప్ డేట్‌లు..

1) లాచెన్, లాచుంగ్‌లలో సుమారు 3 వేల మంది చిక్కుకుపోయారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ భూషణ్ పాఠక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. “700-800 మంది డ్రైవర్లు, మోటార్‌ సైకిళ్లపై అక్కడికి వెళ్లిన 3,150 మంది అంతా చిక్కుకుపోయారు. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్లతో ఖాళీ చేయిస్తాం. ఆర్మీ సహకారంతో వాయిస్‌ ఓవర్ ఇంటర్నట్ కాల్‌ ద్వారా వారి కుటుంబాలతో మాట్లాడే ఏర్పాటు చేశాం" అని అన్నారు.

2) ఇప్పటివరకు, మొత్తం 2,011 మందిని రక్షించారు. వారిల్లో విదేశీయులతోపాటు మరో 3 వేల మంది పర్యాటకులు ఉన్నారు. దాదాపు 22 వేల మంది ఆకస్మిక వరదల ప్రభావానికి ఎఫెక్ట్ అయ్యారని సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SSDMA) తెలిపింది.

3) చిక్కుకుపోయిన పర్యాటకులను మంగన్ వరకు ఎయిర్-లిఫ్టింగ్ చేస్తూ వారిని తరలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అక్కడి నుండి వారిని రోడ్డు మార్గంలో సిక్కింకు తీసుకువస్తామని పాఠక్ చెప్పారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు సహాయ చర్యల వేగంపై ప్రభావితం చూపుతున్నాయి.

4) సింగ్టామ్ పట్టణంలో నీరు, విద్యుత్ సేవల పునరుద్ధరణ పూర్తయిందని పాఠక్ చెప్పారు. సింగ్టామ్, మంగన్, నామ్చి, గాంగ్టక్ జిల్లాల్లో దాదాపు 277 ఇళ్లు ధ్వంసమయ్యాయి. బాధితులను 26 సహాయ శిబిరాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు.


హెల్ప్‌లైన్ నంబర్లు..

వరదల్లో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సిక్కిం ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించింది. ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్లు 03592-202892, 03592-221152, 8001763383, 03592-202042 - ఫ్యాక్స్; లేదా అత్యవసర సహాయం కోసం '112'కి కాల్ చేయాలని సూచించింది.

భారత ప్రభుత్వం సైతం మూడు హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించింది. ఉత్తర సిక్కిం - 8750887741; తూర్పు సిక్కిం - 8756991895; తప్పిపోయిన సైనికులకు సంబంధించిన విచారణ కోసం 7588302011 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

Updated Date - 2023-10-06T09:08:13+05:30 IST