Home » AP Police
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం పరిధిలోని దండిపూడి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర భయాందోళనలని రేకెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న ఈ పులి, తాజాగా తన మకాంను దండిపూడి అడవులకు మార్చినట్లు అధికారులు గుర్తించారు.
గాదె సాయికృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం సుదీర్ఘంగా విచారించింది. స్వయంగా ఐజీ రంగంలోకి దిగి నేరుగా ప్రశ్నించినప్పటికీ, సీఐ నాగరాజు నోరు మెదపకపోవడం, సమాధానాలు చెప్పకుండా దాటవేయడం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఒక కీలకమైన విషయాన్ని గుర్తించారు.
అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక కారు, ముందు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది.
కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చక్రాయపేట మండలం కుమారకాలవ సమీపంలోని పాపాగ్ని నదిలో ఉన్న ఇసుక క్వారీ నీటి గుంతలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు.
విశాఖపట్నంలో మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దుర్వినియోగం చేసిన ట్యూషన్ టీచర్ షణ్ముఖ్ హితేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకు చెందిన సాధారణ ఫొటోలను ఏఐ సహాయంతో నగ్నచిత్రాలుగా మార్ఫింగ్ చేసి, వాటిని చూపిస్తూ ఆమెను బెదిరించాడు.
చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు రూరల్ మండలంలోని బంగారెడ్డిపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సాయికృష్ణ డెడ్‌బాడీని స్వర్గపురి శ్మశానవాటికలో దహనం చేశారని ఆరోపణలు వస్తుండటంతో అక్కడ ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.