Home » AP Liquor
Remand Report: లిక్కర్ స్కాంలో ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది సిట్. నిందితులు లిక్కర్ సిండికేట్ సభ్యుడు, ఏ1 రాజ్ కసిరెడ్డికి సన్నిహితులని.. స్కాంలో వచ్చిన ముడుపులు వేరే వారికి బదిలీల్లో వీరు కీలక పాత్ర పోషించారని సిట్ తెలిపింది.
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరికొన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. గత రెండు రోజులుగా ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు.
SIT Investigation: మద్యం కుంభకోణం కేసులో రెండో రోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి శ్రీధర్‌ను తరలించారు.
Liquor Scam Investigation: లిక్కర్ స్కాం కేసులో ధనుంజయ్, కృష్ణ మోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. నేటి సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలను వేరు వేరుగా విచారించనున్నారు.
SIT Inquiry Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.
AP liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాల మేరకు వీరందరూ కూడా పాత్రధారులు, సూత్రధారులుగా వ్యవహరించారని మొదటి నుంచి సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే గోవిందప్పను అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పొందుపర్చారు.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన గోవిందప్ప బాలాజీని కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. అయితే జీబు దించకుండానే గోవిందప్పను మళ్లీ సిట్ అధికారులు బయటకు తీసుకు వెళ్లిపోయారు.
AP liquor scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా విచారణకు హాజరుకాకుండా గైర్హాజరయ్యారు. ఎట్టకేలకు మైసూరులో గోవిందప్పను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు.
AP Liquor Scam ED: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగం సిద్ధం చేసింది