SIT Inquiry Liquor Scam: సిట్ విచారణకు ధనుంజయ్, కృష్ణ మోహన్
ABN , Publish Date - May 14 , 2025 | 04:28 PM
SIT Inquiry Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.
విజయవాడ, మే 14: ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న వీరిద్దరు సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించారు. మొత్తం సీఎంవో, జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వీరి ఆదేశాలు లేకుండా చివరకు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా లోపలికి వెళ్లలేని పరిస్థితి. వీరు ఆదేశిస్తేనే నియోజకవర్గాల్లో పనులు చేయాల్సిను దుస్థితి ఏర్పడిందని ఎంతో మంది ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి.
ఈ క్రమంలో మద్యం స్కాంలో కీలకంగా వ్యవహరించిన పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత సిట్ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణుక్య, దిలీప్ మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే నిన్న ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా కోర్టులో ఓ పక్క గోవిందప్ప బాలాజీ విచారణ జరుగుతున్న సమయంలో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.
AP liquor Scam: గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
గత కొన్ని రోజులుగా వారిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమకున్న పలుకుబడితో సిట్ అధికారులకు దొరక్కుండా వీరిద్దరు తప్పించుకుని తిరిగారు. సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మే 16 వరకు కూడా వారిద్దరిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు చెప్పడంతో పాటు, విచారణకు సహకరించాలని ఇద్దరికి సుప్రీం ధర్మాసనం సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈరోజు (బుధవారం) ప్రముఖ న్యాయవాది మన్మధరావును తీసుకుని నేరుగా సిట్ కార్యాలయానికి వచ్చారు. దాదాపు గంట పాటు న్యాయవాది సమక్షంలో విచారణ జరిగింది. మద్యం పాలసీ రూపకల్పన దగ్గర నుంచి ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారు.. ఎవరి నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి అనే దాని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. వీరిద్దరు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం అవసరమైతే మరి కొంతమందిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
DD Next Level Movie: డీడీ నెక్ట్స్ లెవల్ హీరో, నిర్మాతకు లీగల్ నోటీసులు
Adampur Airbase: అబద్ధాల ఫ్యాక్టరీ.. పాకిస్థాన్
Read Latest AP News And Telugu News