Home » AP Assembly Sessions
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఐదేళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారాయన. తనలాంటి వాళ్లు ఎంతోమంది కనీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం శాసనమండలిలో ‘మన బడి మన భవిష్యత్తు’ పథకంపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, టి కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి సంధించిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కల్తీ మద్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. కల్తీ మద్యంపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి.
అసెంబ్లీ లాబీలో పలువురు ఎమ్మెల్యేలతో నందమూరి బాలకృష్ణ సరదాగా సంభాషించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజును డాకూ మహారాజ్ అని పిలిచారు బాలయ్య.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే ఆంధ్రులకు, తెలుగు జాతికి గౌరవం చేకూరినట్టు అవుతుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే ప్రస్తావనను తీసుకొచ్చారు ఎమ్మెల్యే.
ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై ఏపీ శాసనమండలిలో గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చించారు.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై ఈరోజు సభలో ప్రస్తావించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు.
ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై నేడు ధన్యవాదాల తీర్మానం, చర్చ నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈ చర్చను ప్రారంభించనున్నారు.
హిందూ మతాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మతాన్ని గౌరవిస్తారని తెలిపారు.
ఏపీ అసెంబ్లీలో గురువారం నుంచి ఏఐ ఆధారిత అటెండెన్స్ నుంచి అమల్లోకి వస్తుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలు కూడా బయోమెట్రిక్ విధానం అనుసరిస్తున్నారని తెలిపారు.