Security : పరదాల్లేవు.. భారీ బందోబస్తు లేదు..!
ABN , Publish Date - Mar 04 , 2025 | 06:14 AM
వైసీపీ ఐదేళ్ల పాలనలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే ఆ చుట్టుపక్కల ప్రాం తాల ప్రజలు భయపడిపోయేవారు.
జగన్ జమానాలో అసెంబ్లీ సమావేశాలంటే..మూడు వేల మంది పోలీసులతో భారీ భద్రత
కూటమి ప్రభుత్వంలో 525 మందితోనే బందోబస్తు
అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే ఆ చుట్టుపక్కల ప్రాం తాల ప్రజలు భయపడిపోయేవారు. అసెంబ్లీకి సుమారు 20 కిలోమీటర్ల పరిధి నుంచే ఆంక్షలు మొదలయ్యేవి. అప్పటి సీఎం జగన్ నివాసం వద్ద, అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేసేవారు. పతి ఇంటి ముందు పరదాలు, దారి పొడవునా షాపులు మూసివేయించడం వంటివి సర్వసాధారణంగా జరిగేవి. అయితే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. పరదాలు లేవు. ప్రస్తుతం 525 మందితోనే భద్రత ఏర్పాట్లు చేశారు.