Home » Andhrajyothi
ఒక వస్తువు వెయ్యి రూపాయలు ఉండొచ్చు.. లక్ష.. లేదా.. కోట్లు కూడా ఉండొచ్చు.. అంత డబ్బుంటే కొనవచ్చు. కానీ.. జీవించే హక్కు విలువెంత? దానికి ఖరీదు కట్టొచ్చా.. ఎక్కడ దొరుకుతుంది.. ఎన్ని లక్షలు పెడితే వస్తుంది? ఈ ప్రశ్నకు సారస్వత ప్రపంచం ఇచ్చిన ఏకైక సమాధానం ‘విద్య’.
అదొక చిన్న గ్రామం. దూరం నుంచి చూస్తే పచ్చని తివాచీ పరిచినట్లుంటుంది. గ్రామంలోకి అడుగిడితే రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. ‘అదేం చెట్టు?’ అని అడగ్గానే గ్రామస్తులు... చెట్టుకు ఉన్న స్టిక్కర్‌ను ఫోన్‌లో స్కాన్ చేసి చూపిస్తారు.
మనిషి సంతోషంగా ఉండడానికి కొన్ని కొలమానాలుంటాయి. వాటిని ‘ఇండికేటర్స్ ఆఫ్ జాయ్’ అంటారు. అలాంటి 82 కొలమానాలతో లండన్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్’ అనే సంస్థ ‘హ్యాపీ సిటీ ఇండెక్స్’ను ఇటీవల విడుదల చేసింది. అంటే ప్రపంచంలోని ఆనంద నగరాలను గుర్తించింది.
ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే... కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. నోటీసులు అందుకుంటారని, నిపుణులను సంప్రదిస్తారని తెలుపుతున్నారు. ఇంకా ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ ఏ భాషలోనైనా చాలామంది ఉంటారు. అయితే నటీమణులుగా ప్రజాదరణ పొందుతూ కొందరే సుదీర్ఘకాలం కెరీర్‌ను కొనసాగిస్తారు. అలాంటివారిలో కచ్చితంగా విద్యాబాలన్ ముందు వరుసలో ఉంటారు.
వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ చాలాచోట్ల ఉత్సవాలు చేయడం, వేడుకలు నిర్వహించడం చూస్తూనే ఉంటాం. కొన్నిచోట్ల కప్పలకు పెళ్లిళ్లు చేశారనే వార్తలూ వింటుంటాం. అయితే మెక్సికోలోని రెండు గ్రామాల ప్రజలు మాత్రం వాన కోసం రక్తం చిందిస్తారు.
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో చిట్టచివరన ఉంటుంది ‘మనా’. ఇండో-టిబెట్ సరిహద్దుల్లో సముద్ర మట్టానికి 10 వేల 500 అడుగుల ఎత్తులో ఉంది. గ్రామ జనాభా సుమారు 1300. అంతకుముందు ‘మనా’ విషయంలో చాలా గందరగోళం ఉండేది. ఇది భారతదేశపు చిట్టచివరి గ్రామమని, కాదు కాదు... మొట్టమొదటి గ్రామమనేవారు.
కొండలపైన దేవాలయాలు ఉండటం సాధారణమే. కానీ కొండపై గ్రంథాలయం ఉండటం ఎక్కడైనా చూశారా? చైనాలోని ‘మియాన్హువా’ గ్రామానికి వెళితే... కొండ అంచుల్లో ఉన్న గ్రంథాలయం పుస్తక ప్రియులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది.
రాజులు, సాహితీవేత్తలు, తత్వవేత్తలు.. చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, మేధావులు, సామాజికవేత్తలు, విజేతలు, కళాకారులు, మతబోధకులు, ఆవిష్కర్తలు.. ఒకరా.. ఇద్దరా.. అనేకులు. వేలు, లక్షల మంది జీవితకథలు.. భద్రంగా ఉన్నాయి. లోపలికి వెళుతూనే ఊపిరాడనీయవు. ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
వర్షాకాలం నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. ఆ సమయంలో నది దాటాలంటే వంతెన ఉండాల్సిందే. కానీ విచిత్రంగా కాంబోడియావాసులు మాత్రం వర్షాకాలం ప్రారంభం కావడంతోనే అక్కడి మెకాంగ్ నదిపై ఉన్న వెదురు వంతెనను తొలగిస్తారు. నదిలో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టాక తిరిగి వెదురు వంతెన నిర్మించుకుంటారు.