Home » Andhra Pradesh Politics
నియోజకవర్గంలోని ఓ చిన్న గ్రామం బందలాయి చెరువు(Bandalaicheruvu). పేరుకి చిన్నదే అయినా రాజకీయ చైతన్యానికి కొదవలేదు. అవనిగడ్డ(Avanigadda) శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం నుంచి దివంగత మాజీమంత్రి సింహాద్రి సత్య నారాయణరావు(Simhadri Satyanarayana Rao) వరుసగా మూడు సార్లు అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు
అమరావతి, ఏప్రిల్ 18: టీడీపీ యువనేత నారా లోకేష్(Nara Lokesh) తరఫున ఇవాళ ఎన్నికల నామినేషన్(Election Nomination) దాఖలు చేయనున్నారు కూటమి నేతలు. టీడీపీ(TDP)-జనసేన(Janasena)-బీజేపీ(BJP) ముఖ్యనేతల చేతుల మీదుగా 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గురువారం నాడు మంగళగిరిలో(Mangalagiri) సర్వమత ప్రార్థనలతో..
సోమవారం అర్ధరాత్రి పోలీసులు(AP Police) బాపట్ల జిల్లా(Bapatla) మేదరమెట్ల గ్రామంలో ప్రజలను భయభ్రాంతులను చేశారు. ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, 50 మందికిపై పోలీస్ సిబ్బంది, ఫ్లైయింగ్ స్క్వాడ్‌తో గ్రామంలోని ఓ టీడీపీ(TDP) కార్యకర్త ఇంటిని చట్టుముట్టారు. గోడలు దూకి, తలుపులు బాదుతూ హంగామా సృష్టించారు.
‘ఆయన విలువలున్న వ్యక్తి. ఈయన మనసేమో వెన్న, ఇంకొకాయన లోకల్ హీరో’ అంటూ తమ పార్టీ అభ్యర్థులను జగన్ (YS Jagan) పరిచయం చేస్తుంటే వారి చరిత్ర తెలిసిన జనం విస్తుబోయారు. భీమవరం(Bhimavaram) సభలో తన ప్రసంగం పూర్తయ్యాక నరసాపురం(Narasapuram) ఎంపీ అభ్యర్థిని, ఏడు అసెంబ్లీ అభ్యర్థులను సీఎం పరిచయం చేస్తూ పొగడ్తలతో ముంచెత్తారు.
‘వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోంది. టీడీపీ ప్రభుత్వంలో నవ్యాంధ్ర ప్రపంచపటంలోకి ఎక్కితే.. నేడు ఆ పేరు లేకుండా పోయింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. జగన్.. ఇక నీ ఆటలు సాగవు’’ అని సినీ హీరో, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి
‘‘మీ ఫోన్ తీసుకెళ్లి సీబీఐకి ఇవ్వండి. కడిగిన ముత్యంలా బయటకు వస్తారు కదా. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన ఫోన్లను దర్యాప్తు సంస్థకు అప్పగించారు. మీ ఫోన్ ఇచ్చేదానికి ఏమైంది?’’ అని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందంటే... ఈసీ చెప్పినట్లు వినాల్సిందే. ఈసీ ఆదేశాలు పాటించాల్సిందే. కేంద్రం సూచనలు, ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. కానీ... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తీరే వేరు! ఆయన ఇప్పటికీ జగన్నామ స్మరణ చేస్తూనే ఉన్నారు. గీత దాటి మరీ జగన్
ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై ఓ అగంతుకుడు రాయి విసరడం రాజకీయ రచ్చకు కారణమైంది. ఎన్నికల వేళ ఈ ఘటన దురదృష్టకరమే. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటులేదు. కానీ ఇటీవల కాలంలో అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తాము చేసిన పనులకంటే.. తాము నియమించుకున్న పోల్ స్ట్రాటజీ సంస్థలనే ఎక్కువుగా నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ నేతల ఇసుక దాహం ఎప్పటికీ చల్లారేలా లేదు. ఇష్టానుసారంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఆత్మకూరులో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. ఏఎస్ పేటలోని నక్కల వాగులో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతోంది.
‘నిజం గెలవాలి’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 203 కుటుంబాలను పరామర్శించానని, మరో కార్యక్రమంతో మే 10 వరకు ప్రజల్లో ఉండాలని భావిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె