Home » Anantapur
హంద్రీనీవా ప్రాజెక్టు పొడవునా ఉన్న చెరువులను ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పరిరక్షణ పేరుతో ఆదివారం నాడు ఆ కాలువను వైసీపీ నేతల బృందం పరిశీలించిన విషయం తెలిసిందే.
జేఎన్‌టీయూలో ఆరువేల సర్టిఫికెట్ల మిస్సింగ్ వ్యవహారాన్ని అధికారులు తేలికగా తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
మండలంలో బోరు బావుల కింద మిరప సాగును రైతులు ప్రారంభించారు. అదేవిధంగా జీబీసీ- హెచఎల్‌సీ కాలువ కింద పొలాలను సిద్దం చేసుకుంటున్నారు. అయి తే ఈ యేడు వర్షాభావ పరిస్థితి నెలకొనటంతో తుంగభద్రా డ్యాంకు ఇప్పటి వరకూ తగిన నీరు చేరకపోవడంతో మిరప సాగు చేసే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండల పరిధిలోని ఉదిరిపికొండ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరిచాలంటూ గ్రామస్థులు రోడ్డె క్కారు. వారు మంగళవారం గ్రామంలోని అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారిపై గంట పాటు ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహిం చారు.
పట్టణం, అర్బన పరిధి లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సర్ విధులు కేటాయిస్తూ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీఎనయూఎస్, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ నాయకులు కోరారు. వారు మం గళవారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈఓ మస్తానరావుకు వినతి పత్రం అందజేశారు.
కంబదూరు మండలం, కళ్యాణదుర్గం రూరల్, అర్బన పరిధిలోని పలు పోలింగ్ కేం ద్రాలను ఆర్డీవో వసంతబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్ ఎన్యూమరేషన ఫారాల డిజిటలైజేషన ప్రగతి తక్కువగా వుందని, వేగవంతం చేయాలని బీఎల్‌వోలను ఆదేశించారు. బీఎల్‌ఏలు పూర్తిగా సహకరించాలని సూచించారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి మంగళ వారం ఎన్యుమరేషన ఫారాన్ని స్వయంగా పూరించి సంబంధిత బీఎల్‌వోకు అందజేశారు.
ఖరీఫ్ సీజన ఊపందుకున్న ప్రస్తుత తరుణంలో డి. హీరేహాళ్ మండల కేంద్ర రైతులు వేరుశనగ విత్తన కాయల కోసం ఎదురు చూస్తున్నారు. డ బ్బులు చెల్లించి 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ వ్యవసాయశాఖ కార్యాలయం వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ తిట్టలేదని.. ఆయన వ్యతిరేక సిద్ధాంతాలపైనే మాట్లాడుతానని చెప్పుకొచ్చారు.
తాము ఎన్నికై ఐదేళ్లు పూర్తి అవుతున్నా మండల సమావేశాల్లో తాము చర్చించిన సమస్యలు తీరలే దంటూ ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వ హిం చారు.