Home » Amit Shah
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న సీఐఐ సదస్సుకు పారిశ్రామిక వేత్తలను వీరు ఆహ్వానం పలుకుతున్నారు.
ఇవాళ సాయంత్రం కేంద్ర హోమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కలవనున్నారు. కష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలుస్తునందుకు కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలపనున్నారు.
చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు.. చిరిగిన పార్టీ జెండాలు.. విరిగిన స్తంభాలు.. నలిగిపోయిన మంచినీటి బాటిళ్లు.. తమిళనాట కరూర్‌లోని వేలుచ్చామిపురం ప్రాంతంలో ఆదివారం నెలకొన్న పరిస్థితి ఇది....
మావోయిస్టుల కాల్పుల విరమణ ఆఫర్‌ను స్వాగతిస్తున్న వారిపై అమిత్‌షా మండిపడ్డారు. వామపక్ష తీవ్రవాదంపై చేపట్టిన 'ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్'ను ఆపేయాలని ఇటీవల వామపక్షాలు ముఖ్యంగా సీపీఐ, సీపీఐ-ఎంలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయని చెప్పారు.
దేశం మునుపెన్నడూ చూడని ప్రజాకర్షక ప్రధానమంత్రి మోదీ అని, ఇటు స్వదేశంలోనూ, అంతర్జాతీయంగానూ అత్యంత జనాకర్షణ కలిగిన ప్రధానిగా పేరుతెచ్చుకున్నారని అమిత్‌షా పేర్కొన్నారు.
పార్టీ నుంచి బహిష్కృతులైన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్), వీకే శశికళను మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు స్పష్టం చేశారు.
స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్ పాలనలో వారు ఇష్టానుసారంగా వ్యవహరించారని మల్లు రవి గుర్తు చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణ కూడా బ్రిటిష్ వారి పాలనను తలపించిందని ఆరోపించారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తేతనను సీఎం పదవిలో కూర్చోబెడతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముందే చెప్పారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో జూలై 7వ తేదీ ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర శుక్రవారం తేని జిల్లా కంబం నియోజకవర్గం చేరుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వనరులను సమీకరించి సహాయక చర్యలు చేపడుతుందని మంత్రులు పేర్కొన్నారు. 7 ఎన్డీఆర్ఎఫ్, 15 ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, సుమారు 100 మంది సైనిక సిబ్బంది సహాయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని తెలిపారు.
తమిళనాడు బీజేపీలో అంతర్గత కలహాలకు చెక్ పెట్టి కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించేందుకు అమిత్‌షాతో రాష్ట్ర బీజేపీ నేతలు న్యూఢిల్లీలో బుధవారం భేటీ అయ్యారు.