Home » Amit Shah
ఆంగ్ల భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజు వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆ భాష వలసవాద బానిసత్వానికి చిహ్నమని తెలిపారు...
ముఖ్యమంత్రిగా చంద్రబాబు సుదీర్ఘ పాలనానుభవం ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్థి బాటలో నడిపిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని భరోసా ఇచ్చారు.
Minister Lokesh: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్ 25 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని లోకేష్ కోరారు.
ఆర్మీలో విధి నిర్వహణను పూర్తి చేసుకున్న మాజీ అగ్నివీర్‌లకు ఉపాధి కల్పించే విషయమై సమన్వయం చేసే బాధ్యతలను కేంద్ర హోం శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 29న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన హైదరాబాద్‌లో సమావేశమవుతారు.
అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది. విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. దీనిపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.
ఈ పదకొండేళ్లలో ఆర్థిక పునరుద్ధరణ, సామాజిక న్యాయం, సాంస్కృతిక గౌరవం, జాతీయ భద్రతతో కొత్త శకాన్ని దేశం చూస్తోందని కేంద్ర హోమంత్రి అమిత్‌షా అన్నారు. బలమైన నాయకత్వం, దృఢ సంకల్పం, ప్రజాసేవ చేయాలనే తపన ఉంటే సుపరిపాలన సాధ్యమేనని మోదీ ప్రభుత్వం నిరూపించిందని వివరించారు.
తమిళనాట అధికార డీఎంకే అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 10 శాతం హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు. ఎన్ని వాగ్దానాలు అమలు చేశారో జాబితా ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ను సవాలు చేశారు.
కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో బీజేపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి అమిత్‌షా ఆదివారం నాడు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును మాత్రమే కాకుండా జాతి భద్రతను నిర్ణయించే ఎన్నికలని అన్నారు. బంగ్లాదేశీయుల కోసం దేశ సరిహద్దులను మమతా బెనర్జీ తెరిచిపెట్టారని ఆరోపించారు.
పూంచ్ పౌరులు, అధికారులు చూపించిన సాహసం, దేశభక్తి యవద్దేశానికి స్ఫూర్తినిస్తుందని అమిత్‌షా ప్రశంసించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పిరికిపందల చర్య అని, ఏ ఒక్క ఉగ్రవాద చర్యను ఉపేక్షించరాదన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధాన నిర్ణయమని చెప్పారు.