Share News

Amit shah: వారిని వదిలేది లేదు.. కేంద్రమంత్రి అమిత్ షా సెన్సేషనల్ కామెంట్స్..

ABN , Publish Date - Jun 29 , 2025 | 05:50 PM

నిజామాబాద్‌లో కేంద్రమంత్రి అమిత్ షా పసుపు బోర్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని అన్నారు.

Amit shah: వారిని వదిలేది లేదు.. కేంద్రమంత్రి అమిత్ షా సెన్సేషనల్ కామెంట్స్..
Union Minister Amit Shah

Union Minister Amit Shah: నిజామాబాద్‌లో కేంద్రమంత్రి అమిత్ షా పసుపు బోర్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని అన్నారు. పసుపు బోర్డు ఇక్కడికి రావడంలో రాష్ట్ర బీజేపీ ఎంపీల కృషి చాలా ఉందన్నారు. నిజామాబాద్ పసుపు ప్రపంచ మార్కెట్ లోకి వెళ్తుందని, పసుపు ధర పెరుగుతుందని, వ్యాపారాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్స్ ఆఫీస్ కూడా నిజామాబాద్‌లో ఉంటాయని, వివిధ దేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు.


ఈ క్రమంలోనే.. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా పాకిస్థాన్ మూకలకు బుద్ధి చెప్పామన్నారు. ఈ నేపథ్యంలోనే.. నక్సల్స్ ఆయుధాలు పక్కన పెట్టి లొంగిపొవడం మంచిదని సూచించారు. నక్సల్ కు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఆయుధాలు పట్టిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. నక్సల్స్ కు మద్దతుగా మాట్లాడే వారు, వారి బాధిత కుటుంబాల పరిస్థితి తెలుసుకోవాలని అన్నారు. 2026 మార్చి చివరి వరకు నక్సల్స్ ను పూర్తిగా అంతమొందిస్తామన్నారు. రాష్ట్రంలో భారీ అవినీతి జరిగిందని, తెలంగాణ మొన్నటి వరకు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా ఉందని, ఇప్పుడు రేవంత్ రెడ్డికి మారిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే అవినీతి అంతం అవుతుందని కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.


Also Read:

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్

ఘనంగా కొనసాగుతున్న గోల్కొండ బోనాల జాతర

For More Telugu News

Updated Date - Jun 29 , 2025 | 06:14 PM