Share News

Amit Shah: రేపు రాష్ట్ర పర్యటనకు రానున్న అమిత్‌ షా

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:40 AM

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

Amit Shah: రేపు రాష్ట్ర పర్యటనకు రానున్న అమిత్‌ షా

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 1.45 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటారు. అక్కడ జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. దివంగత నేత డి.శ్రీనివాస్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం, పాలిటెక్నిక్‌ కాలేజ్‌ మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి హైదరాబాద్‌ చేరుకుని ఢిల్లీ వెళతారు.

Updated Date - Jun 28 , 2025 | 04:40 AM