Home » Ahmedabad
ఘటనా స్థలి నుంచి రమేష్ బయటకు వస్తుండగా ఆ వెనుక విమానం కాలిపోతున్న దృశ్యాలు పెద్దఎత్తున పొగ చుట్టుపక్కల వ్యాప్తించడం కనిపిస్తోంది. ప్రమాదంలో గాయపడిన అతనిని చూసి కొందరు అతన్ని అక్కడి నుంచి తరలించడం వీడియోలో చోటుచేసుకుంది.
Vijay Rupani: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృత దేహాన్ని సోమవారం ఉదయం 11:30 గంటలకు అధికారులు రూపానీ కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో రాజ్‌కోట్‌కు తరలిస్తారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి.
గత గురువారం, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 274 మంది మరణించారు. గత దశాబ్ద కాలంలో జరిగిన అతిపెద్ద విమానయాన ప్రమాదంగా దీనిని అభివర్ణిస్తున్నారు.
Air India plane crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద దుర్ఘటనలో ఇప్పటివరకు 15 మంది మృతుల డీఎన్‌ఏ వారి కుటుంబసభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు సివిల్ హాస్పిటల్ సీనియర్ వైద్యుడు వెల్లడించారు.
Ahmedabad Plane Crash: అత్యంత విషాదకరమైన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రధానంగా బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది. బ్లాక్ బాక్స్‌లో ఎంత మేరకు సమాచారం ఉందనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Plane Crash Death Toll: అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడినవారు సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదానికి కల్తీ ఇంధనమే కారణమా? దీనివల్లే తగినంత ఎత్తు ఎగిరేందుకు అవసరమైన శక్తి విమానానికి లభించలేదా? అంటే కొందరు విమానయాన రంగ నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా... ఏఐ-171 విమాన ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ ‘ఏఐ-171’ నెంబరును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఇంజన్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రోటాకాల్ ప్రకారం ఏప్రిల్ 2025లో ఎడమవైపు ఇంజన్‌ను కూడా తనిఖీ చేశారని, ఇంజన్లో కానీ, విమానంలో కానీ ఎలాంటి సమస్యలు లేవని అధికారులు చెప్పారు.
బోయింగ్ 787 లోపభూయిష్టమని, ప్రయాణికుల ప్రమాదకరమని సలోహ్‌పోర్ అనే విజిల్‌బ్లోయర్ ఏడాది క్రితమే హెచ్చరించారు. తాజాగా ఇదే విషయాన్ని మాజీ బోయింగ్ అత్యున్నత స్థాయి మేనేజర్ నుంచి విజిల్‌బ్లోయర్‌గా మారిన ఎడ్ పియర్సన్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.