Share News

Flight Accident insurance: రూ.10తో కోటి రూపాయల బీమా.. విమాన ప్రమాద బీమా గురించి ఈ విషయాలు తెలుసా?

ABN , Publish Date - Jun 15 , 2025 | 03:48 PM

గత గురువారం, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 274 మంది మరణించారు. గత దశాబ్ద కాలంలో జరిగిన అతిపెద్ద విమానయాన ప్రమాదంగా దీనిని అభివర్ణిస్తున్నారు.

Flight Accident insurance: రూ.10తో కోటి రూపాయల బీమా.. విమాన ప్రమాద బీమా గురించి ఈ విషయాలు తెలుసా?
flight accident insurance

గత గురువారం, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది (Air India Plane Crash). ఈ ప్రమాదంలో దాదాపు 274 మంది మరణించారు. గత దశాబ్ద కాలంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదంగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ భారీ విషాదం విమాన ప్రమాద బీమా ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చింది. విమాన ప్రమాద బీమా అంటే ఏమిటి, దీనికి ఎంత కవరేజ్ వస్తుంది, ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం (flight accident insurance).


విమాన ప్రమాద బీమా అంటే విమాన ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగితే ప్రయాణీకుడికి లేదా అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే బీమా. ఇది మరణం, తీవ్రమైన గాయం లేదా వైకల్యం వంటి పరిస్థితులను కవర్ చేస్తుంది. విమాన ప్రయాణ సమయంలో ఒక వ్యక్తి మరణిస్తే అతడి కుటుంబానికి లేదా నామినీకి అందించే మొత్తం రూ. 25 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు గాయపడితే అతడి ఆసుపత్రి ఖర్చులు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య ఖర్చులు, చికిత్స తర్వాత సంరక్షణ ఖర్చులు కూడా కవర్ అవుతాయి. ప్రమాదం కారణంగా ప్రయాణీకుడికి పాక్షిక లేదా పూర్తి వైకల్యం ఏర్పడితే, వైద్య ఖర్చులు, నష్టపరిహారం కూడా అందిస్తారు.


విమాన ప్రమాద బీమా చాలా చవకైనది. ప్రయాణ దూరం, గమ్యస్థానం, బీమా కవర్ ఆధారంగా ఖర్చు రూ.10 నుంచి రూ.500 వరకు ఉంటుంది. విమాన ప్రమాదాలు ఊహించలేనివి. అటువంటి పరిస్థితిలో బీమా, ప్రయాణీకులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత అందిస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా సంక్షోభ సమయాల్లో ఆర్థిక సహాయంగా కూడా మారుతుంది. విమానంలో ప్రయాణించే వారు ఖచ్చితంగా విమాన ప్రమాద బీమా తీసుకోవడం అతి ముఖ్యం.


ఇవి కూడా చదవండి

ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. రంగంలోకి యూకే

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 15 , 2025 | 03:48 PM