• Home » Adilabad

Adilabad

భీమారం చేరుకున్న ప్రజారగ్‌ జోల్‌ యాత్ర

భీమారం చేరుకున్న ప్రజారగ్‌ జోల్‌ యాత్ర

సామాజిక న్యాయం, రాజ్యాధికారం లక్ష్యంతో కొనసాగుతున్న ప్రజారగ్‌ జోల్‌ యాత్ర ఆదివారం భీమారం చేరుకుంది. సేవాలాల్‌ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబునాయక్‌, సెంట్రల్‌ కమిటీ చైర్మన్‌ ప్రేమ్‌చంద్‌నాయక్‌, జిల్లా అధ్యక్షుడు గుగులోత్‌ మల్లేష్‌ నాయక్‌ అంబేద్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు.

పోలీసులు క్రీడల్లో రాణించాలి

పోలీసులు క్రీడల్లో రాణించాలి

పోలీసులు క్రీడల్లో రాణించా లని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ అన్నారు. ఆదివారం ఎఎంసీ క్రీడా మైదానంలో సబ్‌ డివిజన్‌ స్థాయి పోలీసుల క్రికెట్‌ పోటీలను నిర్వహిం చారు. ఏసీపీ మాట్లాడుతూ రోజు పోలీసులు విధి నిర్వహణలో భాగంగా ఒత్తిడికి గురవుతారని, క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు శారీరక ధారుడ్యం పెరుగుతుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు పేర్కొ న్నారు. ఆదివారం ఇందా రం, ఎల్కంటి, గంగిపెల్లి, జైపూర్‌ గ్రామాల్లో ఇంది రమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు.

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలన

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలన

ఇందారం బస్టాండ్‌ వద్ద శుక్రవారం రాత్రి బైక్‌ ఢీకొని సుంకరి మల్లయ్య అనే రిటైర్డు కార్మికుడు మృతిచెందగా ఆదివారం ప్రమాదం జరిగిన స్థలాన్ని సీఐ వేణుచందర్‌ పరిశీలించారు. సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారని కానీ కనెక్షన్‌ ఇవ్వ కపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

కార్పొరేషన్‌ దిశగా అడుగులు

కార్పొరేషన్‌ దిశగా అడుగులు

మంచిర్యాల మున్సిపాలిటీ ఇక కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ కానుంది. ఈ మేరకు ఈ నెల 19న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో మంచిర్యాలను మున్సిపల్‌ కార్పొరే షన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలి

పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని 1, 4, 11, 20 వార్డుల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రావు, చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేతతో కలిసి పరిశీలించారు.

చేతివృత్తులతో యువతకు ఉపాధి

చేతివృత్తులతో యువతకు ఉపాధి

చేతి వృత్తులతో యువతకు ఉపాధి లభిస్తుందని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ చేతివృత్తుల డైరెక్టర్‌ దివ్యారావు అన్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణను పొందుతున్న మహిళలకు నస్పూర్‌ కాలనీలోని సేవా భవన్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

సూపాకలో మారమ్మ జాతర

సూపాకలో మారమ్మ జాతర

మండలంలోని సూపాక గ్రామంలో శుక్రవారం మారమ్మ జాతర ప్రారంభమైంది. మారమ్మ, లక్ష్మీదేవి విగ్రహాలను గ్రామస్థులు పల్లకిలో చెన్నూరు గోదావరి నదికి కాలినడకన చేరు కున్నారు.

కామన్‌ మెనూపై   స్పష్టత ఏదీ...?

కామన్‌ మెనూపై స్పష్టత ఏదీ...?

ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచిన ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి కామన్‌ మెనూ ఎంత ఇవ్వాలనే అంశాన్ని విస్మరించింది. నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, చికెన్‌, మాంసానికి అనుగుణంగా 40 శాతం మెస్‌ చార్జీలను, 200 శాతం వరకు కాస్మొటిక్‌ చార్జీలను పెంచడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు.

కలెక్టరేట్‌ ఎదుట రెండో ఏఎన్‌ఎంల నిరసన

కలెక్టరేట్‌ ఎదుట రెండో ఏఎన్‌ఎంల నిరసన

కొన్నేళ్ళుగా పని చేస్తున్న తమకు రాత పరీక్ష పెట్టాలన్నా విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కలెక్టరేట్‌ ఎదుట తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రెండో ఏఎన్‌ఎంలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రెండు రోజుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి