Home » ACB
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో లంచం తీసుకుంటూ డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఏసీబీకి చిక్కారు.
మదనపల్లె డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నాగిశెట్టి రాజశేఖర్ ఆస్తులు రూ.1.60కోట్లు వున్నట్లు ఏసీబీ అధికారులు లెక్కగట్టారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నిందితుడు రవికుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ ఒక మధ్యంతర నివేదికను విడుదల చేసింది.
అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా రావడంతో ఏసీబీ సోదాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ కు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. రూ.10 వేల పూచికత్తుతో పాస్‌పోర్టు ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. అయితే మార్చి 3లోగా పాస్‌పోర్టు తిరిగి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
వైసీపీ అధికారంలో ఉండగా ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై నమోదు చేసిన సీఐడీ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆయనతోపాటు మిగిలిన నిందితులకు క్లీన్‌చిట్ ఇచ్చింది.
ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దాఖలైన ప్రొటెస్ట్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది.
ఫైబర్ నెట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫైబర్ నెట్ కేసులో మదుసూధన్ రెడ్డి ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. అయితే ఈ కేసును మూసి వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ని విచారించడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో ఏసీబీ అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేస్తోంది. మొత్తం 23 టీమ్స్‌తో ఇవాళ (శనివారం)సోదాలు జరిపారు. గండిపేట్, శేరిలింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్..