Share News

Bribe Case: లీజు అగ్రిమెంటు కోసం రూ.60 వేలు లంచం

ABN , Publish Date - Jul 01 , 2025 | 04:41 AM

బాపట్ల జిల్లా కొల్లూరు గ్రూపు దేవాదాయాల కార్యనిర్వహణాధికారి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సోమవారం సాయంత్రం పట్టుబడ్డారు.

Bribe Case: లీజు అగ్రిమెంటు కోసం రూ.60 వేలు లంచం

  • ఏసీబీ వలలో దేవదాయ శాఖ ఈవో

  • డబ్బు తీసుకుంటుండగా పట్టివేత, అరెస్ట్‌

కొల్లూరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా కొల్లూరు గ్రూపు దేవాదాయాల కార్యనిర్వహణాధికారి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సోమవారం సాయంత్రం పట్టుబడ్డారు. కొల్లూరులోని అనంత భోగేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన 16 దుకాణాల లీజును మూడేళ్లకోసారి పొడిగిస్తుంటారు. వాటిలో ఓ దుకాణ నిర్వాహకుడు మరణించడంతో ఆ దుకాణాన్ని అతని కుమారుడు సాయి పేరున లీజు అగ్రిమెంట్‌ చేసేందుకు కార్యనిర్వాహణాధికారి నాగిశెట్టి శ్రీనివాసరావు రూ.లక్ష లంచం డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేని బాధితుడు రూ.60 వేలు ఇస్తామని చెప్పగా, రూ.70 వేలు ఇవ్వాలని సూచించడంతో గత నెల 30న ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు సోమవారం ఈవోకు నగదు అందజేశారు. అక్కడే వేచి ఉన్న ఏసీబీ బృందం ఈవోను అరెస్ట్‌ చేసింది.

Updated Date - Jul 01 , 2025 | 04:41 AM