ACB: ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్
ABN , Publish Date - Jul 05 , 2025 | 05:49 AM
మంచిర్యాల జిల్లా కోటపల్లి రెవెన్యూ కార్యాలయంలో నరేష్ అనే రైతు నుంచి డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కుమార్ రూ. 10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
రైతు నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టివేత
కోటపల్లి, జూలై 4(ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి రెవెన్యూ కార్యాలయంలో నరేష్ అనే రైతు నుంచి డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కుమార్ రూ. 10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం భీమారం గ్రామానికి చెందిన నరే్‌షకు తండ్రి గంట లక్ష్మణ్ పేరుతో కోటపల్లి మండలంలోని రాజారం గ్రామంలో సర్వే నెంబరు 71/13/2లో 20 గుంటల భూమి ఉంది.
ఈ భూమిపై పట్టా పాస్ బుక్ పొందాలంటే ఆధార్ లింక్, ఈ కేవైసీ చేయడం కోసం డిప్యూటీ తహసీల్దార్‌ను కలువగా లంచం డిమాండ్ చేశాడు. రూ.10 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కుమార్‌ను, సహకరించిన తాత్కాలిక ఉద్యోగి అంజిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.