ACB: ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:02 AM
లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు మంగళవారం ఏసీబీకి చిక్కారు. జీహెచ్‌ఎంసీలోని మూసాపేట సర్కిల్ పరిధిలో ఓ వ్యక్తి తన స్థలం ఆన్‌లైన్ మ్యుటేషన్ చేయాలని కోరితే..
కేపీహెచ్‌బీ కాలనీ/ తలకొండపల్లి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు మంగళవారం ఏసీబీకి చిక్కారు. జీహెచ్‌ఎంసీలోని మూసాపేట సర్కిల్ పరిధిలో ఓ వ్యక్తి తన స్థలం ఆన్‌లైన్ మ్యుటేషన్ చేయాలని కోరితే.. ఆస్తి పన్ను విభాగం సీనియర్ అసిస్టెంట్ ఎం.సునీత రూ.80 వేలు లంచం అడిగారు. మంగళవారం బాధితుడి నుంచి ఆమె రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామ రైతు మల్లయ్య భూమి విరాసత్ కోసం వస్తే.. తహసీల్దార్ నాగార్జున రూ.50 వేలు లంచమడిగాడు.
మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటున్న కార్యాలయ అటెండర్ యాదగిరిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ నాగార్జున, యాదగిరిని అరెస్టు చేశారు. తహసీల్దార్ పట్టుబడినట్లు తెలుసుకున్న స్థానికులు.. కార్యాలయానికి వచ్చి బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు.