• Home » 2024

2024

POET : అనంత సాహితీ ప్రకాశం ఆశావాది

POET : అనంత సాహితీ ప్రకాశం ఆశావాది

పద్మశ్రీ డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు అనంత సాహితీ ప్రకాశం అని జనప్రియ కవి ఏలూరి యంగన్న పేర్కొన్నారు. ఆశావాది ప్రకాశరావు తృతీయ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం మొదటిరోడ్డులోని పొట్టి శ్రీరాములు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు.

AIDWA : విద్యార్థినులకు రక్షణ కల్పించాలి

AIDWA : విద్యార్థినులకు రక్షణ కల్పించాలి

స్థానిక ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీలోని విద్యార్థినుల హాస్టల్‌లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కారకులను శిక్షించడంతో పాటు విద్యార్థిను లకు రక్షణ కల్పించాలని ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, ఎస్‌ఎఫ్‌ఐ జి ల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్‌ డిమాండ్‌ చేశారు.

MLA: వైసీపీ అసమర్థ పాలనకు సాక్ష్యం విరిగిన గేట్లు

MLA: వైసీపీ అసమర్థ పాలనకు సాక్ష్యం విరిగిన గేట్లు

వైసీపీ అసమర్థ పాలనకు సాక్ష్యం విరిగిన పేరూరు డ్యాం గేట్లే అని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఆమె సోమవారంమండలంలోని అప్పర్‌ పెన్నార్‌ (పేరూరు) డ్యాంను సందర్శించారు. మరమ్మతులకు గురైన డ్యాం గేట్లను పరిశీలించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వర్షపు నీటితో జలాశయం నిండిన సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా, అవగాహన లేకుండా గేట్లు ఎత్తి వాటిని విరిగ్గొ ట్టారని విమర్శించారు.

HOSPITAL : ఆస్పత్రి ఏఎంసీలో పడకల పెంపుపై కుస్తీ

HOSPITAL : ఆస్పత్రి ఏఎంసీలో పడకల పెంపుపై కుస్తీ

జిల్లా సర్వజనాస్పత్రిలోని అత్యవసర చికిత్సా విభాగం (ఏఎంసీ)లో పడకల పెంపు కోసం జిల్లా అధికారులు కు స్తీపడుతున్నారు. ఏఎంసీలో పడకల సంఖ్య తక్కువుగా ఉండడంతో సీరియస్‌ కేసులకు చికిత్సలు అందించ డానికి సమస్యలు ఏర్పడుతు న్నాయని అదనంగా పడకలు ఏర్పాటుచేయాలని ఇటీవల కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్నతో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ఆదేశించా రు.

GOD : సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

GOD : సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

మండల పరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మూలవిరాట్‌కు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, బంగారు కవచసేవ, పల్లకిసేవ ఆకుపూజ, అర్చనలు చేశారు.

PARKING:  పార్కింగ్‌కు అడ్డాగా పెన్నార్‌ భవన

PARKING: పార్కింగ్‌కు అడ్డాగా పెన్నార్‌ భవన

కలెక్టరేట్‌ సమీపంలోనున్న పెన్నార్‌ భవనలో ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖలతో పాటు ఎస్సీ కార్పొరేషన భవనా లు ఉన్నాయి. నిత్యం జనాలతో రద్దీగా ఉండే ప్రాంతం అది. విశాలంగా ఉన్న ఆవరణం ఆ ప్రాంత కార్యాలయ ఉద్యో గుల వాహనాలకు పార్కింగ్‌కు ఏ మా త్రం ఇబ్బంది ఉండదు. అయితే సమీప ప్రాంతాల్లోని ప్రజలు, అటువైపు వెళ్లే వాళ్ల వాహనాల పార్కింగ్‌కు అడ్డాగా మారిపోయింది.

MLA : ప్రజలు తిరస్కరించినా మార్పురాలేదా?

MLA : ప్రజలు తిరస్కరించినా మార్పురాలేదా?

అర్బన నియోజకవర్గం లోని వచ్చిన 47 రోజుల్లోనే 23వేల ఓట్ల మెజార్టీతో మిమ్మల్ని ఓడించానని, అయినా మీ తీరులో మార్పు రాలేదంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ వైసీపీ నేతలపై మండిపడ్డారు. స్థానిక హౌసింగ్‌ బోర్డులోని ఓ ఫంక్షన హాల్‌లో ఆదివారం సాయంత్రం 22వ డివిజనకు చెందిన వైసీపీ మైనార్టీ నాయకుడు కట్టుబడి బాబాజీ, న్యాయవాది ఇసాక్‌తో పాటు 500 మంది టీడీపీలో చేరారు.

FESTIVAL : ఘనంగా అశ్వత్థనారాయణ తిరునాళ్లు

FESTIVAL : ఘనంగా అశ్వత్థనారాయణ తిరునాళ్లు

మండలంలోని సోమదొడ్డి గ్రామ సమీపంలోని తడకలేరులో వెలసిన అశ్వత్థనారాయణస్వామి తిరునాళ్లు కన్నుల పండువగా సాగాయి. మాఘమాసం మూడో ఆదివారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారికి తెల్లవారుజామున విశేషపూజలు నిర్వహించారు.

CRIME : సావిత్రమ్మ హత్య కేసు ఛేదింపు

CRIME : సావిత్రమ్మ హత్య కేసు ఛేదింపు

నగర శివారులోని టీచర్స్‌ కాలనీలో ఒంటరిగా నివశిస్తున్న సావిత్రి హత్య కేసును నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంలోని పాతూరు నీరుగంటివీధికి చెందిన షేక్‌ అన్సర్‌ అలియాస్‌ చాబూసాను అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి 41 గ్రాములు కలిగిన రెండు బంగారు చైన్లు, రూ.34500లు, సెల్‌ఫోన, ద్విచక్రవాహనం, స్టిక్కర్‌ కట్టింగ్‌ స్లైడింగ్‌ బ్లేడ్‌ స్వాధీనం చేసుకున్నారు.

RDO : లింగ నిర్ధారణ చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి

RDO : లింగ నిర్ధారణ చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి

లింగనిర్ధారణ చేయడం చట్టరీత్యానేమని, అలాంటి చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలుచేయాలని అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో శనివారం డివిజన స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ... రాజ్యాంగం మగపిల్లలతో పాటు ఆడ పిల్లలకు సమాన హక్కులు కల్పించిందన్నారు. అయినా ఆడ పిల్లల పట్ల చిన్న వివక్ష సరికాదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి