AIDWA : విద్యార్థినులకు రక్షణ కల్పించాలి
ABN , Publish Date - Feb 18 , 2025 | 12:17 AM
స్థానిక ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలోని విద్యార్థినుల హాస్టల్‌లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కారకులను శిక్షించడంతో పాటు విద్యార్థిను లకు రక్షణ కల్పించాలని ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, ఎస్‌ఎఫ్‌ఐ జి ల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్ డిమాండ్ చేశారు.
ఎస్పీకి ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల వినతి
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలోని విద్యార్థినుల హాస్టల్‌లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కారకులను శిక్షించడంతో పాటు విద్యార్థిను లకు రక్షణ కల్పించాలని ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, ఎస్‌ఎఫ్‌ఐ జి ల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్ డిమాండ్ చేశారు. ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఎస్పీ జగదీష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమం లో ఐద్వా నాయకులు చంద్రిక, అశ్విని, ఎస్‌ఎఫ్‌ఐ నగరాధ్యక్షుడు భీమేష్, కార్యదర్శి శివ, ఉపాధ్యక్షుడు సోము తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం క్లాక్‌టవర్ : సెంట్రల్ యూనివర్సిటీలోని బాలి కల హాస్టల్‌లో అమ్మాయిలకు రక్షణ కల్పించాలని ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమ్మాయిలను వేధింపులకు గురిచే స్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....