Share News

MLA : ప్రజలు తిరస్కరించినా మార్పురాలేదా?

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:59 PM

అర్బన నియోజకవర్గం లోని వచ్చిన 47 రోజుల్లోనే 23వేల ఓట్ల మెజార్టీతో మిమ్మల్ని ఓడించానని, అయినా మీ తీరులో మార్పు రాలేదంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ వైసీపీ నేతలపై మండిపడ్డారు. స్థానిక హౌసింగ్‌ బోర్డులోని ఓ ఫంక్షన హాల్‌లో ఆదివారం సాయంత్రం 22వ డివిజనకు చెందిన వైసీపీ మైనార్టీ నాయకుడు కట్టుబడి బాబాజీ, న్యాయవాది ఇసాక్‌తో పాటు 500 మంది టీడీపీలో చేరారు.

MLA : ప్రజలు తిరస్కరించినా మార్పురాలేదా?
MLA Daggupati and Venkatashivudu Yadav inviting Babaji and Isak to the party

వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే దగ్గుపాటి మండిపాటు

బాబాజీ, ఇసాక్‌తోపాటు 500 మంది టీడీపీలో చేరిక

అనంతపురం అర్బన, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): అర్బన నియోజకవర్గం లోని వచ్చిన 47 రోజుల్లోనే 23వేల ఓట్ల మెజార్టీతో మిమ్మల్ని ఓడించానని, అయినా మీ తీరులో మార్పు రాలేదంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ వైసీపీ నేతలపై మండిపడ్డారు. స్థానిక హౌసింగ్‌ బోర్డులోని ఓ ఫంక్షన హాల్‌లో ఆదివారం సాయంత్రం 22వ డివిజనకు చెందిన వైసీపీ మైనార్టీ నాయకుడు కట్టుబడి బాబాజీ, న్యాయవాది ఇసాక్‌తో పాటు 500 మంది టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, మంత్రి నారాలోకేశ కార్యకర్తలకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి వైసీపీ నుంచి టీడీపీలోకి అనేక మంది వస్తున్నా రన్నారు. గతంలో వైసీపీకి నమ్మకంగా పనిచేసిన బాబాజీకి అన్యాయం చేయడం బాధాకర మన్నారు. మాజీ ఎమ్మెల్యే అనంతకు సన్నిహితంగా ఉ న్న ఇసాక్‌ టీడీపీలో చేరడం చూస్తుంటే వైసీపీలో ఏ ఒక్క కార్యకర్తకు సరైన న్యాయం జరగడం లేదని స్పష్టమవుతోందన్నారు. వచ్చే రంజాన మాసంలోగా మసీదుల మరమ్మతులకు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. నగర మేయర్‌ వసీం తన అంకుల్‌ మాటలు వింటూ ఏది పడితే అది మాట్లాడటం సరి కాదన్నారు. గతంలో మీలో ఎవ రైనా జనంలో తిరిగారా అని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. మీరు ఏమీ చేయలేదు కాబట్టే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని అన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల కోసం పనిచేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు గౌస్‌మొద్దీన, చంద్రదండు ప్రకాష్‌నాయుడు, ముక్తియార్‌, గంగారామ్‌, బాబా ఫకృద్దీన, జెఎం బాషా, స్వామిదాస్‌, రాయల్‌ మురళీ, డి స్కో బాబు, పోతుల లక్ష్మీనరసింహులు, కడియాల కొండన్న, పీఎల్‌ఎన మూర్తి, పరమే శ్వరన, గోపాల్‌ గౌడ్‌, చేపల హరి, మారుతీనాయుడు, వెంక టేశ్వరరెడ్డి, నెట్టెం బాలకృష్ణ, జైనుబ్బి, మంజుల తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 16 , 2025 | 11:59 PM