PARKING: పార్కింగ్‌కు అడ్డాగా పెన్నార్ భవన
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:02 AM
కలెక్టరేట్ సమీపంలోనున్న పెన్నార్ భవనలో ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖలతో పాటు ఎస్సీ కార్పొరేషన భవనా లు ఉన్నాయి. నిత్యం జనాలతో రద్దీగా ఉండే ప్రాంతం అది. విశాలంగా ఉన్న ఆవరణం ఆ ప్రాంత కార్యాలయ ఉద్యో గుల వాహనాలకు పార్కింగ్‌కు ఏ మా త్రం ఇబ్బంది ఉండదు. అయితే సమీప ప్రాంతాల్లోని ప్రజలు, అటువైపు వెళ్లే వాళ్ల వాహనాల పార్కింగ్‌కు అడ్డాగా మారిపోయింది.

పట్టించుకోని అధికారులు
అనంతపురం ప్రెస్‌క్లబ్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్ సమీపంలోనున్న పెన్నార్ భవనలో ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖలతో పాటు ఎస్సీ కార్పొరేషన భవనా లు ఉన్నాయి. నిత్యం జనాలతో రద్దీగా ఉండే ప్రాంతం అది. విశాలంగా ఉన్న ఆవరణం ఆ ప్రాంత కార్యాలయ ఉద్యో గుల వాహనాలకు పార్కింగ్‌కు ఏ మా త్రం ఇబ్బంది ఉండదు. అయితే సమీప ప్రాంతాల్లోని ప్రజలు, అటువైపు వెళ్లే వాళ్ల వాహనాల పార్కింగ్‌కు అడ్డాగా మారిపోయింది. నిత్యం ఎవరో ఒకరు వచ్చి ఆ కాంపౌండ్‌లో కార్లు, ట్రాక్టర్లు, మినీ వ్యానలు, టూవీలర్లు పార్కింగ్ చేసి వెళ్తున్నారు. గురువారం ఆంధ్రజ్యోతి పరిశీలనలో... పెన్నార్ భవన కాం పౌండ్‌లో ఇతరుల ట్రాక్టరు, కార్లు పార్కింగ్ చేయడం కనిపించింది. ఈ వి షయంలో పట్టించుకోవాల్సిన అధికారులు తమ కేమీ సంబంధం లేదన్న ట్లుగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణమని పలువురు ఉద్యోగులు వా పోతున్నారు. మరోవైపు ఆ పెన్నార్ భవనకు రాత్రివేళ ల్లో గస్తీ నిర్వహించే సెక్యూరిటీ గార్డు నిర్లక్ష్యం కూడా కారణం అంటున్నారు. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు స్పందించి పెన్నార్ భవన కాంపౌండ్‌లో ఉద్యోగు వాహనాలు తప్ప ఇతర వాహనాలు పార్కింగ్ చేయకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....