Share News

FESTIVAL : ఘనంగా అశ్వత్థనారాయణ తిరునాళ్లు

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:56 PM

మండలంలోని సోమదొడ్డి గ్రామ సమీపంలోని తడకలేరులో వెలసిన అశ్వత్థనారాయణస్వామి తిరునాళ్లు కన్నుల పండువగా సాగాయి. మాఘమాసం మూడో ఆదివారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారికి తెల్లవారుజామున విశేషపూజలు నిర్వహించారు.

FESTIVAL : ఘనంగా అశ్వత్థనారాయణ తిరునాళ్లు
Aswatthanarayanaswamy in decoration

అనంతపురం రూరల్‌, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని సోమదొడ్డి గ్రామ సమీపంలోని తడకలేరులో వెలసిన అశ్వత్థనారాయణస్వామి తిరునాళ్లు కన్నుల పండువగా సాగాయి. మాఘమాసం మూడో ఆదివారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారికి తెల్లవారుజామున విశేషపూజలు నిర్వహించారు. అభిషేకాలు, అలంకరణ అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బోనాలు సమర్పించారు. పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆయల ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. తినుబండారాలు, పిల్లల ఆటవస్తువులు, గాజులు ఇతరత్ర వాటిని కొనుగోలు చేస్తూ సందడి చేశారు. తిరునాళ్లను పురస్కరించుకుని పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సోములదొడ్డి, పామురాయికి చెందిన టీడీపీ నాయకులు భక్తులకు ఉచితంగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 16 , 2025 | 11:56 PM