ఏటా వేలాది మందితో బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ విదేశాల్లో ఉన్న తెలుగువారిని మైమరిపింపజేస్తున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డాలస్ (టీపాడ్) ఈసారి వేడుకను మరింత మెమొరబుల్‌గా నిర్వహించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారందరు కలిసికట్టుగా దమ్మాం ప్రాంతంలో తెలుగు ప్రవాసీ సంఘం సాటా (యం) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన దసరా – బతుకమ్మ ఉత్సవాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.
ఏపీ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, HDPT-హిందు ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఛైర్మన్ (క్యాబినెట్ ర్యాంకు), భాజపా నేత డా. దాసరి శ్రీనివాసులు శనివారం డల్లాస్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రవాసాంధ్రులతో ఆయన సమావేశమయ్యారు.
మెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని కాపిటల్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. తిరుమలను మరిపించేలా అర్చకులు శ్రీవారి కళ్యాణ క్రతువును కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక పరిసరాలు గోవింద నామాలతో మార్మోగాయి.
అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ బోస్టన్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కళాశాలలో కూచిపూడి, భరతనాట్యం పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహాకులు వెల్లడించారు.
గల్ఫ్‌లో ఉపాధి కోసం వలస వెళ్లి.. అసువులు బాసిన తెలంగాణ ప్రవాసీకి దాదాపు ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలు జరిగిన సంఘటన తాజాగా బహ్రెయిన్‌లో చోటు చేసుకుంది.
తెలుగు డయాస్పోరాకు చెందిన విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.
తానా కళాశాల బృందం అట్లాంటాలో ప్రాక్టికల్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. అట్లాంటా నుండి మొత్తం 24 మంది విద్యార్థులు వివిధ కోర్సులు, వివిధ స్థాయిలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
బ్రిటన్‌లోని లూటిన్ మహానగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. లూటిన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో తెలుగు వారు హాజరయ్యారు.
గల్ఫ్‌లోని కీలక దేశమైన సౌదీ అరేబియాలో శుక్రవారం రాత్రి నిర్వహించిన పి-4 అవగాహన కార్యక్రమానికి స్థానిక నివసిస్తున్న ప్రవాసాంధ్రులు.. ప్రత్యేకించి మహిళల నుండి విశేష స్పందన లభించింది.