Share News

NRI: దుబాయిలో అంబేద్కర్ వర్ధంతి.. ఎన్నారైల నివాళులు

ABN , Publish Date - Dec 07 , 2025 | 06:06 PM

దుబాయిలో శనివారం సాయంత్రం డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ సేవా సమితి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మహానుభావుడి సేవలు, స్ఫూర్తిదాయక భావాలు, సామాజిక న్యాయానికి చేసిన కృషిని స్మరించుకోవాలని అన్నారు.

NRI: దుబాయిలో అంబేద్కర్ వర్ధంతి.. ఎన్నారైల నివాళులు
Ambedkar death anniversary Dubai

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ధనం, అధికారం, కులమతాలు అన్ని రంగాలలో పెత్తనం చలాయిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మరింత నిబద్ధతతో అమలు చేయాల్సిన అవసరం ఉందని దుబాయిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యు.ఎ.ఇ సేవా సమితి నాయకులు పేర్కొన్నారు.

దుబాయిలో శనివారం సాయంత్రం డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో సేవా సమితి నాయకులు మాట్లాడుతూ ఆ మహానుభావుడి సేవలు, స్ఫూర్తిదాయక భావాలు, సామాజిక న్యాయానికి చేసిన కృషిని స్మరించుకోవాలని అన్నారు. అరబ్బు ఎడారి దేశాలలో కూడా బాబా సాహెబ్ వర్ధంతిని నిర్వహించుకోవడం గురుతర బాధ్యత అని చెప్పారు.


అంబేద్కర్ వాదులమని చెప్పుకుంటూ అంబేద్కర్, పూలే పేర సంఘాలు పెట్టుకొన్న వారిలో ఎంత మంది ఆ మహనీయులు చూపిన జీవన మార్గంలో కొనసాగుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవశ్యకత ఉందని సమితి నాయకులు తరపట్ల మోహన్ అన్నారు. దుబాయి, ఇతర ఎమిరేట్లలో అన్ని వర్గాల సహకారంతో తాము బలహీనవర్గాలకు చెందిన ప్రవాసీయుల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను మోహన్ వివరించారు. రిజర్వేషన్ ఫలాలు పొందిన వాళ్ళు నిజమైన అంబేద్కర్ వాదులుగా మారి ‘పే బ్యాక్ టు సొసైటీ’కి అంకితమైతే అందరు సమానంగా సమాజంలో ఎదుగుతారని గోగి శరత్ కుమార్ అన్నారు. కాగిత కుమార్, గెడ్డం నరేశ్, తాడి విగ్నేష్ రెడ్డి, తాడి అఖిల్, మురలా ఆనంద్, కాటూరి నవీన్, గబ్బుల రాజు, ఏలూరి పీటర్, నల్లి రాజ్ కుమార్, నల్లి అనిల్, సురేశ్ బొండదా, దినేష్ గోగి, కడలి ఆనంద్, రాజేశ్ నల్లి, సిద్ధు, కిషోర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్‌కు నివాళులు ఆర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్.. అమెరికాలో లోకేశ్ విస్తృత పర్యటన

ప్రియమైన ఎన్నారై టీడీపీ సైనికులారా కదలిరండి: జయరామ్ కోమటి

Read Latest and NRI News

Updated Date - Dec 07 , 2025 | 09:14 PM