SATA: దమ్మాంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా సాటా క్రికెట్ పోటీలు
ABN , Publish Date - Nov 27 , 2025 | 10:09 PM
సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్‌లో అత్యంత ఉత్సాహభరితంగా రెండు వారాల పాటు జరిగిన తెలుగు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఇటీవల ముగిశాయి. దమ్మాం, అల్ ఖోబర్, ఇతర ఈశాన్య ప్రాంతాలకు చెందిన మొత్తం ఎనిమిది జట్లు ఇందులో పాల్గొనగా తెలుగు ఫైటర్స్ విజేతగా దక్కన్ చార్జర్స్ రన్నర్ అప్‌గా నిలిచాయి.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దినమంతా యాంత్రిక జీవితాన్ని గడిపే ప్రవాసీ ఉద్యోగుల శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదం చేస్తాయని ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘం సాటా ఈస్ట్రన్ అధ్యక్షుడు పల్లెం తేజ అన్నారు. క్రీడలు ప్రత్యేకించి క్రికెట్ మానసిక శారీరక దృఢత్వానికి ఉపకరించడమే కాకుండా మానసిక వికాసానికి, స్నేహ పూరిత వాతావరణాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని ఆయన అన్నారు.
సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్‌లో అత్యంత ఉత్సాహభరితంగా రెండు వారాల పాటు జరిగిన తెలుగు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఇటీవల ముగిశాయి. దమ్మాం, అల్ ఖోబర్, ఇతర ఈశాన్య ప్రాంతాలకు చెందిన మొత్తం ఎనిమిది జట్లు ఇందులో పాల్గొనగా తెలుగు ఫైటర్స్ విజేతగా దక్కన్ చార్జర్స్ రన్నర్ అప్‌గా నిలిచాయి.

ఆరోగ్యకరమైన శారీరక జీవన విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తమ సంఘం సాటా భవిష్యత్తులో క్రికెట్‌తో పాటు వివిధ రకాల క్రీడాపోటీలను నిర్వహించడానికి కృషి చేస్తుందని తేజ ఈ సందర్భంగా అన్నారు.
తెలుగు వారియర్స్ (కెప్టెన్ గిరి ఎరకం), యూనీరైజర్స్ (కెప్టెన్ హనీఫ్), వీకెండ్ క్రికెట్ క్లబ్ (కెప్టెన్ ప్రభు), తెలుగు ఫైటర్స్ (కెప్టెన్ నవీన్), ఫ్రెండ్లీ క్లబ్ (కెప్టెన్ ప్రశాంత్), సూపర్ స్ట్రయికర్స్ (కెప్టెన్ గంగాధర్), దక్కన్ చార్జర్స్ క్లబ్ (కెప్టెన్ మస్రూర్), తెలుగు టైటాన్స్ (కెప్టెన్ యం.ఆర్.యం రెడ్డి)లు జట్లు తలపడ్డాయి. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా మునీర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా షాహిద్, బెస్ట్ బౌలర్ సిరీస్‌గా సుమంత్, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా మునీర్, బెస్ట్ ఫీల్డర్‌గా నవీన్‌లను ప్రకటించారు.
క్రికెట్ పోటీల నిర్వహణలో జగన్ తిరుమల, భార్గవ్ మోహన్, వరప్రసాద్ పబ్బతి, వినయ్, మోహన్, రవులపల్లి భరత్‌ల పాత్రను సాటా కార్యవర్గం ప్రశంసించింది.
ఈ వార్తలు కూడా చదవండి
డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబురాలు