ట్రక్ డ్రైవర్‌లకు వర్కర్ వీసాల జారీని నిలిపివేస్తున్నట్టు ట్రంప్ సర్కారు తాజాగా ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు, అమెరికన్ల ఉపాధిని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఓ ప్రకటనలో తెలిపారు.
వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 55 వీసాదారులపై నజర్ పెట్టింది. వారి వివరాలను సమీక్షిస్తున్నట్టు పేర్కొంది.
తానా అద్యక్షుడు నరెన్ కొడాలి, తానా కొశాధికారి రాజ కసుకుర్తి అధ్దర్యంలో తెలుగు రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
రాజ్యసభ మాజీ సభ్యులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు టెక్సాస్ రాష్ట్రంలో అరుదైన గౌరవం లభించింది. టెక్సస్ రాష్ట్ర ప్రభుత్వంతో సహా, డాలస్ పరిసర ప్రాంతంలో ఉన్న మూడు ముఖ్య నగరాలైన ఫ్రిస్కో, గార్లండ్, లిటిల్ ఎల్మ్ నగరాల మేయర్లు ఆయనకు అభినందన పూర్వక అధికారిక గుర్తింపు పత్రాలు అందజేశారు.
ఏడడుగుల బంధం ఎడారి దేశాలకు వచ్చేసరికి ఎండమావులవుతుంది. సంపాదన కోసం ఎడారి దేశాలకు వచ్చిన తర్వాత స్వంత వారే పట్టించుకోవడం లేదు. బహ్రెయిన్‌లో ఇద్దరు ప్రవాసాంధ్ర మహిళలకు ఎదురైన పరిస్థితి గురించి తెలుసుకుంటే హృదయం భారం అవక మానదు.
యూఎస్‌లోని అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సేవా రంగంలో దూసుకుపోతుంది. అందులో భాగంగా అమెరికాలోని వివిధ నగరాలలో ఆప్త, అమెరికన్ రెడ్ క్రాస్ సంయుక్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాయి.
ప్రపంచంలో అతి పెద్దదైన న్యూ యార్క్ ఇండియా పరేడ్ వేడుకలో భాగంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా పాల్గొంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు జీరో ప్లాస్టిక్ గురించి సందేశం ఇచ్చారు. సభ్యులు గర్వంగా, ఉత్సాహంగా జెండాలను ఊపుతూ 85 డిగ్రీల వేడిలో రెండు మైళ్లదూరం నడిచారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి ఆర్థిక సాయంతో చదువుల్లో రాణించిన కర్నూలు జిల్లా విద్యార్థిని ఎంట్రన్స్ టెస్టులో ఉత్తీర్ణత సాధించి వెటర్నరీ సైన్స్‌కు ఎంపికయ్యారు.
ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకూ 6 వేల పైచిలుకు స్టూడెంట్ వీసాలు రద్దు చేసినట్టు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. చట్ట ఉల్లంఘనలు మొదలు ఉగ్రవాదానికి మద్దతు తెలపడం వరకూ పలు కారణాలతో ఈ వీసాలు రద్దు చేసినట్టు తెలిపింది.
ఫ్లోరిడాలో భారతీయుడి నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఓ యాక్సిడెంట్ రాజకీయ దుమారం రేపుతోంది. కాలిఫోర్నియా గవర్నర్, ట్రంప్ ప్రభుత్వం మధ్య పరస్పర ఆరోపణల పర్వానికి దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది.