Share News

TANA hike: అట్లాంటాలో తానా హైక్‌ అండ్‌ కనెక్ట్‌ కార్యక్రమం విజయవంతం..

ABN , Publish Date - Oct 12 , 2025 | 08:54 PM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం గ్రేటర్‌ అట్లాంటాలోని చార్లెస్టన్‌ పార్క్‌, లేక్‌ లేనియర్‌ కమ్మింగ్‌ లో నిర్వహించిన తానా హైక్‌ అండ్‌ కనెక్ట్‌ కార్యక్రమం అద్భుత విజయం సాధించింది. లేక్‌ లేనియర్‌ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో తానా సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

TANA hike: అట్లాంటాలో తానా హైక్‌ అండ్‌ కనెక్ట్‌ కార్యక్రమం విజయవంతం..
TANA Hike & Connect

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) గ్రేటర్‌ అట్లాంటాలోని చార్లెస్టన్‌ పార్క్‌, లేక్‌ లేనియర్‌ కమ్మింగ్‌ లో నిర్వహించిన తానా హైక్‌ అండ్‌ కనెక్ట్‌ కార్యక్రమం అద్భుత విజయం సాధించింది. లేక్‌ లేనియర్‌ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో తానా సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 200 మందికి పైగా సభ్యులు 4 మైళ్ల హైక్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆరోగ్యం, స్నేహం, ఐక్యత అనే నిజమైన తానా స్ఫూర్తిని ప్రదర్శించింది. హైక్‌ తర్వాత, అందరూ రుచికరమైన భారతీయ అల్పాహారం, తాజా డోనట్స్‌, వేడి కాఫీని ఆస్వాదించారు (TANA Hike & Connect).

tana2.jpg


కుటుంబాలు, స్నేహితులు కలుసుకోవడానికి, సరదాగా గడపడానికి సంతోషకర వాతావరణాన్ని ఈ కార్యక్రమం కలిగించింది (hiking event). చెట్ల నీడలో, ప్రశాంతమైన గాలి, సరస్సు దృశ్యాలతో కూడిన సుందరమైన చార్లెస్టన్‌ పార్క్‌ ట్రాక్‌లు అందరిలో ఉత్సాహాన్ని నింపాయి. కుటుంబ సభ్యులు, పిల్లలు, స్నేహితులు పక్కపక్కనే నడుస్తూ, అద్భుతమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. కొత్త స్నేహాలను ఈ కార్యక్రమం ద్వారా ఏర్పరుచుకున్నారు.

tana3.jpg


ఈ కార్యక్రమాన్ని తానా ప్రాంతీయ ప్రతినిధులు శేఖర్‌ కొల్లు, మధుకర్‌ యార్లగడ్డ విజయవంతంగా నిర్వహించారు. వీరికి తానా అట్లాంటా నాయకులు శ్రీనివాస్‌ లావు, అంజయ్య చౌదరి లావు, భరత్‌ మద్ది నేని, సునీల్‌ దేవరపల్లి, రాజేష్‌ జంపాల, ఉప్పు శ్రీనివాస్‌, సోహిని అయినాల, మాలతి నాగభైరవ, ఆర్తిక ఆన్నే, పూలాని జస్తి, వినయ్‌ మద్ది నేని, కోటేశ్వర రావు కందిమళ్ళ, యశ్వంత్‌ జొన్నలగడ్డ, నరేన్‌ నల్లూరి తదితరులు మద్దతు అందించారు (nature and connection).

tana4.jpg


హైకింగ్‌ మార్గాన్ని ప్లాన్‌ చేసిన రాజేష్‌ జంపాలకు, అందరికీ సురక్షితమైన, ఆనందదాయకమైన అనుభవాన్ని అందించేలా మార్గదర్శకత్వం చేసిన యశ్వంత్‌ జొన్నలగడ్డకు తానా నాయకులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అద్భుతమైన సహాయం అందించిన వాలంటీర్లు ఫణి జమ్ముల, చైతన్య కోరపాటి, పవన్‌, శివ నాగ తోట తదితరులకు నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి లైసెన్స్‌డ్‌ ఫైనాన్షియల్‌ మార్ట్‌గేజ్‌ ప్రొఫెషనల్‌ సాయిబాబు మద్దినేని స్పాన్సర్‌ గా వ్యవహరించారు. అంజయ్య చౌదరి లావు, ఇతర తానా నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు.

Updated Date - Oct 12 , 2025 | 08:54 PM