Share News

Telugu Samithi of Nebraska: తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా(TSN)నూతన కార్యవర్గం

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:09 AM

'తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా' నూతన కార్యవర్గం కొలువుతీరింది. అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం, ఓమాహా నగరంలో ఉన్న 'ఓమాహా హిందూ టెంపుల్ కమ్యూనిటీ సెంటర్‌'లో ఈ ఆవిష్కరణ సమావేశం..

Telugu Samithi of Nebraska: తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా(TSN)నూతన కార్యవర్గం
Telugu Samithi of Nebraska

ఓమాహా(అమెరికా)అక్టోబర్ 8: 'తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా' (TSN) నూతన కార్యవర్గం కొలువుతీరింది. అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం, ఓమాహా నగరంలో ఉన్న 'ఓమాహా హిందూ టెంపుల్ కమ్యూనిటీ సెంటర్‌'లో ఈ 2025-2026 నూతన కార్యవర్గ ఆవిష్కరణ సమావేశం ఘనంగా జరిగింది.

సమావేశాన్ని సంస్థ జనరల్ సెక్రటరీ తాతా రావు ప్రారంభించి, హాజరైన తెలుగు ప్రజలను సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగత ప్రసంగం చేశారు. అనంతరం TSN అధ్యక్షుడు కోమటిరెడ్డి గత సంవత్సరం నిర్వహించిన చారిటీ, ఎడ్యుకేషన్, కల్చరల్ కార్యక్రమాలపై సమగ్ర సమీక్షను అందించారు.

TSN.jpgట్రెజరర్ సాంబా 2024–2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ-వ్యయ వివరాలు, ఈవెంట్ వైజ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ను వీడియో ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సభ్యులు బైలాస్ సవరణలు, భవిష్యత్తు కమిటీలలో సభ్యత్వ ఆసక్తి, సమితి అభివృద్ధికి సూచనలు పంచుకున్నారు.

ఈ క్రమంలో సుందర్.. నూతన అధ్యక్షుడిగా కొల్లి  ప్రసాద్ గారిని ప్రతిపాదించగా, హాజరైన సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే ఇతర పదవులకూ కొత్త సభ్యులను ఎంపిక చేయడం, కొంతమంది ప్రస్తుత సభ్యులను తదుపరి స్థాయికి ప్రమోట్ చేయడం చేశారు.

TSN-4.jpg


TSN 2025–2026 నూతన కార్యవర్గం వివరాలు:

President:  కొల్లి  ప్రసాద్

Vice President: తాతా రావు

General Secretary: అలగన్ (కొత్త)

Cultural Secretary: శ్రీమతి రమ్య రవిపాటి

Treasurer: సాంబా డివులా

Joint Treasurer: యుగంధర్ పంగా


EC Members:

అనిల్ పోతినేని(Continue)

అవినాష్ (New Member)

ధన గొట్టి పాటి (New Member)

రమేష్ రాయపాటి (Continue)

వీరేంద్ర ముప్పారాజు (Continue)

బాల కమిరెడ్డి (New Member)

Board of Directors:

శ్రీమతి  లక్ష్మీ మాధురి చిన్నీ (Newly)

వేణు గోపాల్ మురకొండ (Newly)

అనూప్ (Continue)

శ్రీమతి నీలిమ (Lincoln) (Newly)

చైతన్య రవిపాటి (Newly)

TSN-2.jpg


సమావేశం ముగింపులో ప్రస్తుత అధ్యక్షుడు రాజా కోమటిరెడ్డి.. నూతన అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ తోపాటు, సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సమితి అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని ఆకాంక్షించారు. 

గత 15 ఏళ్ల TSN చరిత్రలో ఈ సార్వత్రిక సమావేశంలోనే అత్యధిక హాజరు నమోదు కావడం విశేషం. ఈ కార్యక్రమానికి గత అధ్యక్షులు, ప్రముఖులు జి.సత్యనారాయణ పావులూరి, , మురళీధర్ చింతపల్లి, ఫణి అడ్డిదాం, సుందర్ చుక్కరా, సోము కొడాలి, మహేష్, శరత్ బొడేపూడి, మైనేని కామేశ్వరరావు, శ్రీనివాస్ రావుల, ప్రసాద్ కండిమల్ల, ఆది బాబు, వేణు పొతినేని, నవీన్ కంటం, మరెందరో ఈ కార్యక్రమానికి విచ్చేసి, కొత్త కమిటీకి ఆశీర్వాదాలు అందించారు.

TSN-3.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ లిక్కర్ స్కాం కేసు.. నిందితులకి బెయిల్ ఆర్డర్స్ ఇవ్వకుండా సిట్ పిటిషన్

పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్.. ఎందుకంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 11:19 AM