Chandrababu: విజయవాడ- సింగపూర్ ఫ్లైట్ త్వరలో ప్రారంభం.. ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలిపిన శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు
ABN , Publish Date - Oct 11 , 2025 | 09:44 PM
విజయవాడ-సింగపూర్ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు శ్రీసాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు ధన్యవాదాలు తెలిపారు. ఈ దిశగా సీఎం హామీ ఇచ్చిన రెండు నెలలకే సర్వీసు ప్రారంభం కాబోతోందని హర్షం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు ఎన్నారైల ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ - సింగపూర్ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీసాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు రత్నకుమార్ కవుటూరు ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. నవంబర్ 15 నుంచి ఈ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసు ప్రారంభం కానుంది.
గతంలో సింగపూర్ పర్యటన సందర్భంగా డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసుపై సీఎం హామీ ఇచ్చారని రత్నకుమారు గుర్తు చేశారు. ఆ తరువాత రెండు నెలలకే ఇది అందుబాటులోకి రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సర్వీసు కోసం తెలుగు ఎన్నారైలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని అన్నారు. దీని వల్ల ఎన్నారైలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. వ్యాపార, సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని మరింత సమున్నతంగా నిలబెట్టడంలో ఇదో మైలురాయి అని అభివర్ణించారు.
ఈ మహత్తర కార్యాన్ని సుసాధ్యం చేయడంలో సీఎం కృషి, దూరదృష్టి నిజంగా ప్రశంసనీయని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పించేలా ఎయిర్ కనెక్టివిటీని విస్తరించేందుకు సీఎం చేపడుతున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

ఇవి కూడా చదవండి
డల్లాస్‌లో సీనియర్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు పర్యటన
వర్జీనియాలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం
Read Latest NRI News And Telugu News