సౌదీ అరేబియాలోని జన సేన అభిమానులు వినూత్న రీతిలో తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. జనసేన వీర మహిళలు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు.
పలు సామాజిక సేవా కార్యక్రమాలతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) దూసుకుపోతోంది. అందులో భాగంగా తానా ఆధ్వర్యంలో నార్త్ సెంట్రల్ టీమ్.. మిన్నియా పోలిస్ బెతూన్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్‌లోని 16 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. ఈ క్రమంలో కార్యక్రమ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4 పథకానికి ప్రచారం కల్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దుబాయ్ పర్యటన సందర్భంగా అక్కడి ఎన్నారైలను ఈ పథకం ద్వారా స్వగ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.
హెచ్-1బీ వీసాపై ఇటీవల బ్లైండ్ యాప్‌లో జరిగిన ఓ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్-1బీ వీసా ఉన్న వారి తమ ఉద్యోగావకాశాలకు గండి కొడుతున్నారని 56 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు.
తెలుగువారి క్రీడాప్రతిభను వెలికి తీసేందుకు తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీలు విజయవంతమయ్యాయి. ఈ ఈవెంట్లో ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చదువుల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్న కర్నూల్ విద్యార్థిని రవి పొట్లూరి ఆర్థికసాయం అందించారు. రూ.1.5 లక్షల సాయంతో అతడిని ఇంటర్మీడియట్లో చేర్పించారు.
ఆస్ట్రేలియాలో భారతీయుల మనసులు గాయపరిచేలా కామెంట్స్ చేసిన సెనెటర్ జసింటా క్షమాపణలు చెప్పాలని ఆస్ట్రేలియా ప్రధాని డిమాండ్ చేశారు. సొంత పార్టీ నేతలే ఆమె క్షమాపణలను కోరుతున్నారని వ్యాఖ్యానించారు.
పదకొండేళ్లుగా భారత్‌లో ఉంటున్న ఓ రష్యా మహిళ ఈ దేశం సూపర్ అంటూ కితాబునిచ్చింది. ఇక్కడి వారి ఆతిథ్యం, స్నేహశీలతకు తిరుగులేదని పేర్కొంది. ఈ మేరకు మహిళ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
గల్ఫ్‌లో వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలను గోదావరి జిల్లాల ప్రవాసీయులు ముందుండి నడిపించారు.