Share News

Oman Sahasra Lingarchana: అరేబియాలో అపురూపం .. ఈ ఆధ్యాత్మిక ఘట్టం

ABN , Publish Date - Nov 02 , 2025 | 06:18 PM

ఒమాన్‌లో తెలుగు వారు కార్తీక మాసం సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో సహస్ర లింగార్చన చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక ఎన్నారైలు పాల్గొన్నారు.

Oman Sahasra Lingarchana:  అరేబియాలో అపురూపం .. ఈ ఆధ్యాత్మిక ఘట్టం
sahasra lingarchana oman

  • ఒమాన్‌లో సహాస్ర లింగార్చన

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: పుట్టిన ఊరును కన్న తల్లిని కాదని ఎక్కడో దూరానికి వచ్చినా మాతృభూమినే నమ్ముకునే మెత్తటి మనసున్న మట్టిలోని మాణిక్యాలు ఎడారిలోని తెలుగు ప్రవాసీయులు. ఏ సందర్భం వచ్చినా మాతృభూమిని గుర్తు చేసుకునే తెలుగు బిడ్డలు కార్తీక మాసంలో మట్టిని ముద్దాడుతూ శివలింగాలను చేసి సహస్ర లింగార్చన చేసిన అపురూప ఆధ్యాత్మిక ఘట్టం ఒమాన్‌ దేశంలో చోటు చేసుకొంది (Sahasra Lingarchana Oman).

మస్కట్ శివారులో శుక్రవారం వేద మంత్రోచ్చారణ మధ్య సహస్ర లింగార్చన కార్యక్రమం కన్నులపండువగా సాగింది. స్థానిక ప్రముఖ వేద పండితులు ధర్మపురి విజయకుమార్‌ ఆధ్వర్యంలో తయారు చేసిన 1115 మట్టి లింగాలకు పురోహితులు రుద్రాభిషేకం నిర్వహించారు. కొందరు ఈ పుట్టమట్టిని స్వదేశం నుండి తీసుకురాగా అత్యధికులు మాత్రం స్థానికంగా లభించే నిజ్వా అనే ప్రాంతం నుండి తీసుకొచ్చి శివాకృతులను సిద్ధం చేసారు.

telugu nri devotional event

కార్తీక మాసం అనేది భక్తి, సేవ, ఐక్యతకు ప్రతీక అని కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి వచ్చిన ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ అనంతలక్ష్మి వ్యాఖ్యానించారు. కార్తీక మాసంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి ఆమె వివరించారు.

భారతీయ పండుగలు, సంస్కృతి విదేశీగడ్డపై భారతీయులను ఐక్యపర్చడానికి ఉపకరిస్తున్నాయని ఒమాన్‌లోని భారతీయ రాయబారి జి.వి.శ్రీనివాస్ పేర్కొన్నారు. సహనం, ఐక్యతను చాటిచెప్పే ఈ రకమైన కార్యక్రమాలకు అనుమతించినందుకు ఒమాన్ సుల్తాన్, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

1.jpg


ఒమాన్‌లోని సహస్ర లింగార్చనలో పాల్గొన్న ప్రవాసీయుల భక్తి, ఆధ్యాత్మికతను చూస్తే తనకు సికింద్రాబాద్‌లోని మహంకాళీ దేవస్థానంలోని బొనాల పండుగలో భక్తుల సందడి గుర్తొస్తోందని కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సికింద్రాబాద్ మహంకాళీ డివిజన్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ యస్. సైదయ్య తనను కలిసిన ప్రవాసీయులతో వ్యాఖ్యానించారు.

పరాయి దేశంలో సహస్ర లింగార్చనలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయామని కార్యక్రమంలో ప్రప్రథమంగా పాల్గొన్న తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన అవినాష్ ఇనాల అనే ఇంజినీర్ వ్యాఖ్యానించారు.

8.jpg

ఈ సందర్భంగా నిర్వహించిన వనభోజనాలలో భాగంగా సహపంక్తి భోజనాలలో 18 రకాలైన వివిధ వంటకాలతో చిరు మెగా యూత్ ఫోర్స్ సభ్యులు వడ్డించారు.

ఒమాన్‌లోని తెలుగు ప్రవాసీయుల సహాయసహకారాలతో తాము గత కొన్నాళ్ళుగా వనభోజనాలు, సహస్ర లింగార్చన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా ముఖ్యనిర్వహుకుడైన చిరు మెగా యూత్ ఫోర్స్ అధ్యక్షుడు చందక రాందాస్ తెలిపారు. ఒమాన్‌లో తెలుగు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో గత 15 సంవత్సరాలుగా చురుకైన పాత్రను పోషిస్తున్నారు.

4.jpg3.jpg9.jpg7.jpg6.jpg


ఈ వార్తలు కూడా చదవండి

సౌదీ అరేబియా దీపావళి ఉత్సవం.. పాల్గొన్న అరబ్బులు, విదేశీ దౌత్యవేత్తలు

అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం: నాట్స్

Read Latest and NRI News

Updated Date - Nov 02 , 2025 | 06:35 PM