Share News

Janasena Vanabhojanalu: దుబాయ్‌లో దేవతా వనాల మధ్య జనసేన వనభోజనాలు

ABN , Publish Date - Oct 29 , 2025 | 10:11 PM

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గల్ఫ్ జనసేన అభిమానులు వనభోజనాలు ఏర్పాటు చేశారు. జనసేన కన్వీనర్ కేసరి త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

Janasena Vanabhojanalu: దుబాయ్‌లో దేవతా వనాల మధ్య జనసేన వనభోజనాలు
Gulf Jana Sena Vanabhojanalu

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయ్ ఎడారులలో ఆకాశహర్మ్యాల మధ్య పచ్చదనం కోసం వెలసిన ఒక ఉద్యానవనంలో దేవతా వనాల మధ్య గల్ఫ్ జనసేన అభిమానులు వనభోజనాలను ఏర్పాటు చేశారు. వేద శ్లోకాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది (Gulf Janasena Vanabhojanalu).

దుబాయ్‌తో పాటు ఇతర ఎమిరేట్లలలో నివసిస్తున్న జనసేన అభిమానుల కోసం దుబాయ్‌లోని గల్ఫ్ జనసేన కన్వీనర్ కేసరి త్రిమూర్తుల ఆధ్వర్యంలో గత నాలుగేళ్ళుగా ప్రతి కార్తీక మాసంలో నిర్వహించే వనభోజనాల్లో భారీ సంఖ్యలో జనసేన అభిమానులు పాల్గొంటారు.


వీర మహిళల ఉత్సాహం, జనసేన కార్యకర్తల ఆత్మీయత కూడా తోడవడంతో అక్కడకు వచ్చినవారందరూ పరవశించిపోయారు. స్వదేశంలో కంటే కూడా మిన్నగా కార్తీక మాస వనభోజనాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్న అనుభూతి కలిగిందని తిరుపతి నుండి ప్రత్యేకంగా వచ్చిన జనసేన అధికారిక ప్రతినిధి కీర్తన వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమాన్ని త్రిమూర్తులతో పాటు జాతీయ కన్వీనర్ చంద్రశేఖర్ మొగల్లా ఆధ్వర్యంలో కన్వీనర్లు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, వాలంటీర్లు సమన్వయంతో నిర్వహించారు. ఇందులో పాల్గొనడానికి సౌదీ అరేబియా నుండి వీర మహిళ దుగ్గరపు ఉషా ప్రత్యేకంగా వచ్చారు.

వన భోజనాల కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన కార్యవర్గం వెంకటేష్, నరేష్, డి. ప్రసాద్, చిన్న,స్వామి, నన్నం రాజేష్, ఉదయ్ శ్రీ, రాజా, సుబ్రహ్మణ్యం, రాజేష్ జోగా, హరి, సుద్దబత్తుల శ్యాం కుమార్, నాగేంద్ర, షాహుల్, మనీష, జగదీష్, కన్నబాబు, నారాయణ, నానిలతో పాటు వీరమహిళలు సురేఖా, చిన్ని, వెన్నెల, త్రివేణిలకు వీర మహిళల విభాగం ఇంచార్జ్ మంజుల, కేసరి రజిత, లీడ్ కన్వినర్ నామా విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గల్ఫ్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమానాలు నడపాలి..ఏపీ సీఎంకు ఎన్నారైల విజ్ఞప్తి

మహిళా శరణాలయాల్లో తానా, లీడ్ ది పాత్ ఫౌండేషన్ సేవా కార్యక్రమం

Read Latest and NRI News

Updated Date - Oct 29 , 2025 | 10:46 PM