అఖిలపక్ష సమావేశానంతరం మీడియాతో కాంగ్రెస్ విప్ కె.సురేష్ మాట్లాడుతూ, ఎస్ఆర్ఐ అంశంపై చర్చించాలని విపక్షాలు కోరాయని, ఎస్ఐఆర్‌ను కూడా జతచేసి ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చకు సమావేశం నిర్ణయించిందని తెలిపారు.
భారతదేశంలో కూడా పేదప్రజలు ఉన్నారని, వారు ఈ దేశ పౌరులని, వారికి నిర్దిష్ట ప్రయోజనాలు, సౌకర్యాలు అవసరం లేదనుకుంటున్నారా? వాళ్లపై ఎందుకు దృష్టి సారించరు? అని పిటిషనర్‌ను సీజేఐ ప్రశ్నించారు.
కేవలం ఎస్ఐఆర్ పైనే కాకుండా ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఎస్ఐఆర్‌పై వెంటనే చర్చ జరగాలని ఉభయసభల్లోనూ విపక్షాలు పట్టుబడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్‌భవన్ పేరును లోక్ భవన్‌గా మార్చింది. రాజ్ భవన్‌తో పాటు పీఎంఓ పేరు కూడా మార్చింది. పీఎంఓ పేరును సేవా తీర్థ్‌గా మార్చింది.
నాయకత్వ మార్పుపై అందరిలోనూ గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సిద్ధరామయ్య ఇటీవల తన నివాసంలో డీకేకు బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. రెండో రౌడ్ బ్రేక్‌ఫాస్ట్ చర్చలు ఈసారి డీకే నివాసంలో జరిగాయి.
దేశంలో ఇక నుంచి విక్రయించే ప్రతి సెల్‌ఫోన్‌లో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది. 90 రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది.
మహారాష్ట్ర థానేలో ఓ యువకుడి తొందరపాటుతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పెళ్లిని వాయిదా వేయడంతో మనస్తాపానికి గురై కుటుంబానికి తీవ్ర ఆవేదనను మిగిల్చాడు.
'సంచార్ సాథీ' అంశం ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్ని కుదిపేసింది. ఈ యాప్ తీసుకురావడం ప్రజల ప్రైవసీని కేంద్రం హరించడమేనని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై చర్చకు వ్యతిరేకం కాదని అధికార పక్షం వివరణ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు శాంతించడం లేదు.
ఎంఎన్ఎం పార్టీ అధినేత, నటుడు కమల్‌హాసన్ రాజ్యసభకు ఎంపికవడం పట్ల స్పందిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగం సాధించినంత గర్వంగా ఉందన్నారు. ఆ క్షణంలో తన తల్లిదండ్రులు గుర్తుకువచ్చారని, వెంటనే సమాచారం ఇవ్వాలనుకున్నట్టు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇంకా ఏమన్నారంటే..
రాజధాని చెన్నై నగరం తడిసి ముద్దవుతోంది. ఒకరోజు మొత్తం వర్షం విపరీతంగా కురవడంతో జనజీవనం అతలాకుతమైంది. ‘దిత్వా’ తుఫాన్ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా.. వర్షం కారణంగా మంగళవారం చెన్నై సహా 4 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.