Suicide at Thane: ఆ వయసులో పెళ్లి వద్దన్నందుకు యువకుడు ఆత్మహత్య.. ఎక్కడంటే.?
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:47 PM
మహారాష్ట్ర థానేలో ఓ యువకుడి తొందరపాటుతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పెళ్లిని వాయిదా వేయడంతో మనస్తాపానికి గురై కుటుంబానికి తీవ్ర ఆవేదనను మిగిల్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర(Maharashtra)లో 19 ఏళ్ల ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు(Suicide). తానొక అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పాడు. అయితే.. ఇప్పుడే వివాహమెందుకు? ఇంకో రెండేళ్లు ఆగమన్నారు కుటుంబ సభ్యులు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు తన తొందరపాటు నిర్ణయంతో.. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకు తీవ్ర ఆవేదనను మిగిల్చాడు.
ఇదీ జరిగింది..
జార్ఖండ్(Jarkhand) రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు(19) ప్రస్తుతం మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివ్లీ(Dovimbli at Thane District) ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతడు తన స్వస్థలానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పాడు. అయితే.. చట్టబద్ధంగా పురుషులకు పెళ్లి చేయాలంటే 21 ఏళ్లు నిండాలి(Marriage age 21). కాబట్టి రెండేళ్ల దాకా వాయిదా వేసుకోమని సలహా ఇచ్చారు కుటుంబ సభ్యులు. దీంతో మానసిక ఒత్తిడికి గురైన ఆ యువకుడు.. నవంబర్ 30న ఇంటి పైకప్పుకు స్కార్ఫ్‌తో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: