రాజధాని చెన్నై నగరం తడిసి ముద్దవుతోంది. ఒకరోజు మొత్తం వర్షం విపరీతంగా కురవడంతో జనజీవనం అతలాకుతమైంది. ‘దిత్వా’ తుఫాన్ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా.. వర్షం కారణంగా మంగళవారం చెన్నై సహా 4 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
సాంకేతిక లోపం కారణంగా చెన్నై మెట్రో రైలు అకస్మాత్తుగా సబ్‌వేలో నిలిచిపోయింది. దీంతో, ప్రయాణికులు సొరంగంలో ట్రాక్స్ వెంబడి నడుస్తూ మరో స్టేషన్‌కు చేరుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ మిగతా పదవీకాలం రెండున్నరేళ్లలో ఎవరు ముఖ్యమంత్రిగా వ్యవహరించాలనే అంశం రసకందాయంలో పడింది. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరుగగా, ఇవాళ..
దేశంలో వినియోగించే ప్రతి ఫోన్‌లో సంచార్ సాథీ యాప్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఇకపై దేశంలో తయారయ్యే ఫోన్‌లల్లో వీటిని ముందస్తుగా ఇన్‌స్టాల్ చేశాకే విక్రయించాలని ఫోన్ తయారీదార్లు, దిగుమతిదార్లను టెలికాం శాఖ ఆదేశించింది.
బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.2గా నమోదైంది.
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని ముంబైకు మళ్లించారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.
మహారాష్ట్రలో ఇటీవల ప్రియుడి మృతదేహాన్ని పెళ్లాడి తమ ప్రేమను నిరూపించుకుంది ఓ యువతి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పరువు హత్య కేసులో యువతి తండ్రి అరెస్ట్ అయ్యాడు.
దిత్వా తుఫాను కారణంగా ఉత్తర తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు తదితర జిల్లాల్లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగని వర్షం కురిసింది.
నాటకాలు వేయడానికి పార్లమెంటు వేదిక కాదని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు ఉన్నది ఫలవంతమైన చర్చలతో ప్రజలకు సేవలందించడానికని చెప్పారు...
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. సోమవారం సభలో.. రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌ను....