Share News

Earthquake at Bay of Bengal: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదు

ABN , Publish Date - Dec 02 , 2025 | 08:32 AM

బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.2గా నమోదైంది.

Earthquake at Bay of Bengal: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదు
Earthquake at Bay of Bengal

ఇంటర్నెట్ డెస్క్: బంగాళాఖాతంలో మంగళవారం స్వల్పంగా భూమి కంపించింది(A moderate earthquake at Bay of Bengal ). రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం, ఈ రోజు ఉదయం సుమారు 7:26 గంటలకు 35 కి.మీ. లోతులో భూకంపం(Earthquake) సంభవించినట్టు పేర్కొంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లలేదని ఎక్స్ వేదికగా తెలిపింది ఎన్సీఎస్.


గత నవంబర్ 21న హిందూ మహా సముద్ర ప్రాంతం(Indian Ocean region)లోనూ ఇదే తరహాలో భూకంపం సంభవించింది. నాడు దాని తీవ్రత రిక్టర్ స్కేలు(Richter scale)పై 4.3గా నమోదైందని ఎన్సీఎస్ పేర్కొంది. అయితే.. దాని లోతు మాత్రం 10 కి.మీ.గా ఉందంది.


హరియాణా, నేపాల్‌లోనూ..

ఇదిలా ఉండగా.. సోమవారం సాయంత్రం హరియాణా(Haryana) రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో స్వల్పంగా భూమి కంపించింది. రాత్రి 9:22 గంటల ప్రాంతంలో సోనీపట్(Sonipat ) ఏరియాలో 5 కి.మీ. లోతులో కేంద్రాన్ని గుర్తించినట్టు ఎన్సీఎస్ స్పష్టం చేసింది. అటు పొరుగు దేశం నేపాల్‌(Nepal)లోనూ ఆదివారం ఇదే తరహాలో స్వల్ప భూకంపం సంభవించింది. ఆ దేశంలోని సూదూర్ పశ్చిమ్ ప్రావిన్సు(Sudur Paschim province)లోని బజాంగ్ జిల్లాలో భూమి కంపించి.. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత నమోదైనట్టు అక్కడి అధికారులు తెలిపారు.


ఇవీ చదవండి:

ఉత్తర తమిళనాడును ముంచెత్తిన దిత్వా

పార్లమెంటులో నాటకాలొద్దు

Updated Date - Dec 02 , 2025 | 12:21 PM