బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే దూసుకెళ్తోంది. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122ను దాటి 160కి పైగా స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం 202 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్ష మహాగట్బంధన్ 34 స్థానాలకు పతనమైంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం...
ఎగ్జిట్ పోల్స్ బిహార్ బీజేపీ శ్రేణులను సంబరంలో ముంచెత్తుతోంది. పోల్ డే రోజు పెద్ద ఎత్తున లడ్డూలు పంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మెజారిటీ ఎగ్జిట్ ఫోల్స్ బిహార్‌లో తిరిగి ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మహాగఠ్‌బంధన్‌కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని పేర్కొన్నాయి.
ఈసారి ఆర్జేడీ, కాంగ్రెస్ గెలిచే సీట్లు తగ్గవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఆ ప్రకారం చూసినప్పుడు గత ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌లోని ఆర్జేడీ, కాంగ్రెస్ సాధించిన సీట్లు ఈసారి తగ్గే అవకాశం ఉంది.
ఎన్డీయేకు 145 నుంచి 160 సీట్లు వస్తాయని 'దైనిక్ భాస్కర్' ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ఎన్డీయేకు 147 నుంచి 167 సీట్లు వస్తాయని మాట్రిజ్ అంచనా వేసింది.
బిహార్ రెండో విడత ఎన్నికల్లో భాగంగా 122 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ శాతం నమోదు అయింది.
బిహార్‌లో విజయకేతనం ఎగరేసేది ఎవరనే విషయాన్ని రిజల్ట్‌కు ముందే ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. 6.30 గంటలకు పలు సర్వే సంస్థలు తాము చేపట్టిన సర్వే ఫలితాలును వెల్లడించాయి.
మధ్యాహ్నం వరకూ జరిగిన పోలింగ్‌లో కిషన్‌గంజ్ జిల్లాలో అత్యధికంగా 51.86 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత స్థానంలో గయ 50.95 శాతం ఓటింగ్‌తో ముందంజలో ఉంది. జముయిలో 50.91 శాతం, బంకాలో 50.07 శాతం పోలింగ్ నమోదైంది.
ఈసారి పోలింగ్ జరుగుతున్న పలు నియోజకవర్గాల్లో కూటమి భాగస్వామ్య పార్టీల నేతలే ప్రత్యర్థులుగా తలపడుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. కొన్ని చోట్ల టిక్కెట్లు నిరాకరించడంతో రెబల్ అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు.