-
-
Home » Elections » bihar assembly elections » Bihar second phase election results and live news updates on 14th nov 2025 kjr
-
Bihar Election Results: బిహార్ ఎన్నికలు.. ఎన్డీయే హవా..
ABN , First Publish Date - Nov 14 , 2025 | 06:54 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం 202 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్ష మహాగట్బంధన్ 34 స్థానాలకు పతనమైంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం...
Live News & Update
-
Nov 14, 2025 19:21 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
బీహార్ ప్రజలు NDA కు పట్టం కట్టారు
బీహార్ కాంగ్రెస్ ఒక్క స్థానానికి మాత్రమే పరిమితం అయ్యింది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు ధన్యవాదాలు
MIM సపోర్టుతోనే కాంగ్రెస్ గెలిచింది
తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాలి
BRS సిట్టింగ్ స్థానం కోల్పోయింది
హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది
తెలంగాణ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయం
కాంగ్రెస్ ప్రజా వంచన పరిపాలనఫై పోరాటం చేస్తాం
-
Nov 14, 2025 19:20 IST
రాష్ట్రంలో కేటీఆర్, దేశంలో రాహుల్‌గాంధీ ఐరన్ లెగ్: బండి సంజయ్
కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక హుజూరాబాద్ ఓడిపోయారు: బండి సంజయ్
అధికారం పోయింది.. కవిత దూరం అయింది: బండి సంజయ్
-
Nov 14, 2025 19:20 IST
బిహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించింది: మోదీ
బిహార్‌లో సంక్షేమ, సామాజిక న్యాయం విజయం సాధించింది: ప్రధాని
బిహార్‌లో NDA విజయం అపూర్వం, చరిత్రాత్మకం: ప్రధాని మోదీ
బిహార్ తీర్పు నూతన సంకల్పంతో పనిచేయడానికి శక్తినిచ్చింది: మోదీ
ప్రతిపక్షాల అబద్ధాలను మా కార్యకర్తలు తిప్పికొట్టారు: ప్రధాని మోదీ
బిహార్ అభివృద్ధి, సాంస్కృతిక గుర్తింపునకు కృషిచేస్తాం: మోదీ
-
Nov 14, 2025 16:58 IST
బిహార్ ఎన్నికల్లో విజయం వైపు దూసుకెళ్తున్న ఎన్డీయే హవా
202 స్థానాల్లో ముందంజలో ఎన్డీయే కూటమి
34 స్థానాలకు పతనమైన మహాగట్బంధన్
ప్రధాన పార్టీల ఆధిక్యం వివరాలిలా...
92 స్థానాల ఆధిక్యంలో టాప్‌లో కొనసాగుతోన్న బీజేపీ
82 స్థానాల్లో ముందంజలో జేడీయూ పార్టీ
26 స్థానాలకు తగ్గిన ఆర్జేడీ ఆధిక్యం
19 స్థానాల్లో ఆధిక్యంలో ఎల్‌జేపీఆర్వీ
5 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోన్న కాంగ్రెస్ పార్టీ
-
Nov 14, 2025 16:14 IST
బిహార్ ఎన్నికల్లో కొనసాగుతోన్న ఎన్డీయే హవా
209 స్థానాల్లో ముందంజలో ఎన్డీయే కూటమి
27 స్థానాలకు పతనమైన మహాగట్బంధన్
పార్టీల వారీగా ఆధిక్యం వివరాలు:
96 స్థానాల ఆధిక్యంలో టాప్‌లో కొనసాగుతోన్న బీజేపీ
85 స్థానాల్లో ముందంజలో జేడీయూ పార్టీ
23 స్థానాలకు తగ్గిన ఆర్జేడీ ఆధిక్యం
కేవలం ఒకే ఒక్క స్థానంలో ముందంజలో కొనసాగుతోన్న కాంగ్రెస్ పార్టీ
-
Nov 14, 2025 15:26 IST
బిహార్‌లో ఎన్డీయే కూటమి విజయం దిశగా దూసుకెళ్తున్న తరుణంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సహా, పశ్చిమ్ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి స్పందించారు. ప్రస్తుతం, బిహార్‌లో విజయం ఖాయమని, ఇక తర్వాతి టార్గెట్ బెంగాలేనని వారు వ్యాఖ్యానించారు.
-
Nov 14, 2025 15:19 IST
ఎన్డీయే కూటమి ఆధిక్యంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం మరోమారు రుజువైంది
మోదీ నాయకత్వంలోనే దేశ సమగ్రాభివృద్ధి, సుస్థిర పాలన సాధ్యమని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు
ఈ విషయం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో మరోమారు రుజువైంది
ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సాధించిన స్థానాలు మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి తార్కాణాలు
ఇంతటి విజయానికి కారకులైన నరేంద్ర మోదీకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను
బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న నీతీశ్ కుమార్ పట్ల ఆ రాష్ట్ర వాసులకు ఉన్న అభిమానం చెక్కుచెదరలేదు
ఆ రాష్ట్రంలో విద్య, వైద్య ప్రమాణాలను మెరుగుపరచి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుకువెళ్లారు.
ఈ విజయానికి కారకులైన కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్ షా, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌కు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ.నడ్డాకు అభినందనలు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు
ఈ ఎన్నికలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు
-
Nov 14, 2025 15:09 IST
బిహార్ ఎన్నికల్లో కొనసాగుతోన్న ఎన్డీయే హవా
206 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి
29 స్థానాలకు పడిపోయిన మహాగట్బంధన్ కూటమి ఆధిక్యం
పార్టీల వారీగా ఆధిక్యం వివరాలిలా...
91 స్థానాల ఆధిక్యంలో టాప్‌లో కొనసాగుతోన్న బీజేపీ
79 స్థానాల్లో ముందంజలో జేడీయూ పార్టీ
24 స్థానాలకు తగ్గిన ఆర్జేడీ ఆధిక్యం
మరో స్థానంలో ఆధిక్యం కోల్పోయి మూడుకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ
-
Nov 14, 2025 14:21 IST
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యంపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి బీహార్ ప్రజలు పట్టం కట్టారు
మేము ఊహించనంత భారీ విజయాన్ని ప్రజలు ఇచ్చారు
ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాన్ని తిప్పికొట్టారు
దేశమంతా ఎస్ఐఆర్ జరగాలి
జూబ్లీహిల్స్‌లో ఓటర్ జాబితా తప్పులు తడకగా ఉంది
కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది
ప్రజల దృష్టిలో రాహుల్ గాంధీ నవ్వుల పాలయ్యారు
-
Nov 14, 2025 14:03 IST
బిహార్ ఎన్నికల్లో కొనసాగుతోన్న ఎన్డీయే హవా
198 స్థానాల్లో స్థిరంగా ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీయే
37 స్థానాలకు తగ్గిన మహాగట్బంధన్ కూటమి ముందంజ
పార్టీల వారీగా ఆధిక్యం వివరాలిలా...
91 స్థానాలకు ఎగబాకి టాప్‌లో కొనసాగుతోన్న బీజేపీ
79 స్థానాల్లో ముందంజలో జేడీయూ పార్టీ
28 స్థానాలకు పతనమైన ఆర్జేడీ
4 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ
-
Nov 14, 2025 13:10 IST
బిహార్ ఎన్నికల్లో కొనసాగుతోన్న ఎన్డీయే హవా.. 198 స్థానాల్లో ఆధిక్యం
198 స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ 200కు చేరువలో ఎన్డీయే కూటమి
39 స్థానాలకు తగ్గిన మహాగట్బంధన్ కూటమి ఆధిక్యం
పార్టీల వారీగా ఆధిక్యం వివరాలిలా...
90 స్థానాలకు ఎగబాకి టాప్‌లో కొనసాగుతోన్న బీజేపీ
80 స్థానాల్లో ముందంజలో జేడీయూ పార్టీ
30 స్థానాలకు పడిపోయి వెనుకబడిన ఆర్జేడీ
4 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ
-
Nov 14, 2025 12:55 IST
బిహార్ ఎన్నికల్లో కొనసాగుతోన్న ఎన్డీయే హవా
195 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి
42 స్థానాలకు తగ్గిన మహాగట్బంధన్ కూటమి ఆధిక్యం
పార్టీల వారీగా ఆధిక్యం వివరాలిలా...
89 స్థానాలకు ఎగబాకి టాప్‌లో కొనసాగుతోన్న బీజేపీ
79 స్థానాల్లో ముందంజలో జేడీయూ పార్టీ
32 స్థానాలకు పడిపోయి వెనుకబడిన ఆర్జేడీ
4 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ
-
Nov 14, 2025 12:41 IST
ఎన్డీయే కూటమి ఆధిక్యంపై బీజేపీ నేత మైథిలీ ఠాకూర్ హర్షం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యం కనబర్చడంపై బీజేపీ అభ్యర్థి మైథిలీ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. జానపద గాయకురాలైన 25 ఏళ్ల మైథిలీ.. ప్రస్తుత ఎన్నికల్లో అలీనగర్ అసెంబ్లీ నుంచి పోటీచేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
-
Nov 14, 2025 12:21 IST
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఆధిక్యంపై స్పందించిన ఏపీ సీఎం
బీహార్‌లో ఎన్డీయే కూటమి ఆధిక్యం కనబర్చడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఆ రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మకముంచారని, ఈ మేరకు ఎన్డీయేకు పట్టం కడుతున్నారని సీఐఐ సదస్సులో పేర్కొన్నారు.
Bihar Elections Updates -
Nov 14, 2025 12:07 IST
బిహార్ ఎన్నికల్లో 190 స్థానాల్లో దూసుకెళ్తున్న ఎన్డీయే
190 స్థానాల్లో ఎన్డీయే కూటమి ముందంజ
50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న మహాగట్బంధన్
పార్టీల వారీగా ఆధిక్యం వివరాలిలా...
85 స్థానాల్లో ఆధిక్యంతో టాప్‌లో కొనసాగుతోన్న బీజేపీ
76 స్థానాల్లో ముందంజలో జేడీయూ పార్టీ
34 స్థానాల్లో అధిక్యంతో వెనుకబడిన ఆర్జేడీ
5 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ
-
Nov 14, 2025 11:46 IST
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండటంతో.. ఆ రాష్ట్రంలో జేడీయూ అభిమానులు సంబరాలు చేస్కుంటున్నారు. ఈ మేరకు జేడీయూ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.
-
Nov 14, 2025 11:41 IST
బిహార్ ఎన్నికల్లో 190 స్థానాల్లో దూసుకెళ్తున్న ఎన్డీయే
190 స్థానాల్లో ఎన్డీయే కూటమి ముందంజ
49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూన్న మహాగట్బంధన్ కూటమి
పార్టీల వారీగా ఆధిక్యం వివరాలిలా...
84 స్థానాల్లో ఆధిక్యంతో టాప్‌లో కొనసాగుతోన్న బీజేపీ
75 స్థానాల్లో ముందంజలో జేడీయూ పార్టీ
34 స్థానాల్లో అధిక్యంతో వెనుకబడిన ఆర్జేడీ
6 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం
-
Nov 14, 2025 11:14 IST
190కి పైగా స్థానాల్లో దూసుకెళ్తున్న ఎన్డీయే
191 స్థానాల్లో ఎన్డీయే కూటమి ముందంజ
49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూన్న మహాగట్బంధన్ కూటమి
84 స్థానాల్లో ఆధిక్యంతో జేడీయూ పార్టీ
80 స్థానాల్లో ముందంజలో బీజేపీ
34 స్థానాల్లో అధిక్యంతో వెనుకబడిన ఆర్జేడీ
5 స్థానాల్లో ముందంజతో సింగిల్ డిజిట్‌కు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ
-
Nov 14, 2025 10:10 IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికల అప్డేట్
174 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు
66 స్థానాల్లో ముందంజలో ఉన్న మహాఘట్బందన్ కూటమి అభ్యర్థులు
3 స్థానాల్లో ఇతరుల ఆధిక్యం
ఈ ఫలితాల్లో ఏ మాత్రం ప్రభావం చూపని ప్రశాంత్ కిశోర్ జన సూరాజ్ పార్టీ
-
Nov 14, 2025 10:04 IST
బిహార్ ఎన్నికల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ఎన్డీయే కూటమి
160 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజ
79 స్థానాల్లో ముందంజలో ఇండియా కూటమి
పార్టీల వారీగా ఆధిక్యం కొనసాగుతోందిలా..
జేడీయూ 75 స్థానంలో ముందంజ
బిజెపి 70 స్థానంలో ముందంజ
ఆర్జెడి 60 స్థానంలో ముందంజ
కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో ముందంజ
-
Nov 14, 2025 09:17 IST
బిహార్ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీయే కూటమి
158 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజ
ఇండియా కూటమి 71 స్థానాల్లో ముందంజ
పార్టీల వారీగా ఆధిక్యం ఇలా..
బిజెపి 76 స్థానంలో ముందంజ
జేడీయూ 65 స్థానంలో ముందంజ
ఆర్జెడి 59 స్థానంలో ముందంజ
కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో ముందంజ
-
Nov 14, 2025 09:17 IST
బీహార్ ఎన్నికల్లో ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి
127 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజ
మహాగట్బంధన్ కూటమి 73 స్థానాల్లో ముందంజ
-
Nov 14, 2025 09:09 IST
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యం
86 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజ
ఇండియా కూటమి 63 స్థానాల్లో ముందంజ
పార్టీల వారీగా
బిజెపి 49 స్థానంలో ముందంజ
జేడీయూ 34 స్థానంలో ముందంజ
ఆర్జెడి 46 స్థానంలో ముందంజ
కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో ముందంజ
-
Nov 14, 2025 08:59 IST
బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఆధిక్యంలో NDA
మ్యాజిక్ ఫిగర్ దాటిన NDA కూటమి
నితీష్ కేబినెట్‌లో 10 మంది మంత్రుల ముందంజ
బిహార్: రాఘోపూర్‌లో తేజస్వి యాదవ్ ఆధిక్యం
బిహార్: అలీపూర్‌లో మైథిలీ ఠాకూర్ ముందంజ
బిహార్: తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్ ఆధిక్యం
బిహార్: సివాన్‌లో మంగల్ పాండే (బీజేపీ) ముందంజ
బిహార్: మహువాలో లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్(JJD) ఆధిక్యం
బిహార్: లఖీసరాయ్‌లో విజయ్‌కుమార్ సిన్హా(BJP) ముందంజ
బిహార్: సుఫౌల్‌లో బిజేంద్ర ప్రసాద్(JDU) ముందంజ
బిహార్: రెండు చోట్ల జనసురాజ్ పార్టీ, ఒక చోట MIM ఆధిక్యం
-
Nov 14, 2025 06:54 IST
నేడు బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
బిహార్: ఉదయం 8 నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..
38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు..
బిహార్‌లో మొత్తం 243 స్థానాలకు రెండు దశల్లో జరిగిన ఎన్నికలు..
ఈనెల 6,11న రెండు విడతల్లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు..
బిహార్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ఫిగర్ 122..
బిహార్‌లో అధికార ఎన్డీయే, విపక్ష మహాగఠ్‌బంధన్ మధ్య పోటీ..
ఎన్డీయే కూటమిలో బీజేపీ , జేడీయూ, ఎల్జేపీ (రామ్‌విలాస్)..
ఎన్డీయే కూటమిలో హెచ్‌ఏఎం, రాష్ట్రీయ లోక్‌మోర్చా..
మహాగఠ్‌బంధన్‌లో ఆర్జెడీ, కాంగ్రెస్, సీపీఐఎంఎల్, వీఐపీ..
మహాగఠ్‌బంధన్‌లో సీపీఐ, సీపీఎం, జనశక్తి జనతాదళ్..
238 స్థానాల్లో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 67.13 శాతం పోలింగ్..
కౌంటింగ్ కేంద్రాల దగ్గర రెండంచెల భద్రత, సీసీ కెమెరాలు నిఘా.